Pawan kalyan: పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవాతో విడిపోనున్నారా ? సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలు నిజమేనా!

Posted by venditeravaartha, July 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు రాష్ట్రాల లో పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్..సినిమా ,పాలిటిక్స్ లో రెండిటి లో బిజీ గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే,అతి తక్కువ సమయం లోనే 1 మిలియన్ మార్క్ ఫాలోయర్స్ అందుకున్న పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు ఇప్పుడు మరొక న్యూస్ తో హాట్ టాపిక్ గా మారారు,ఇప్పటికే చాల మంది తన యాంటీ ఫ్యాన్స్ మరియు రాజకీయ ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాల గురించి పదే పదే మాట్లాడుతున్న సమయం లో తన మూడవ భార్య అయినా అన్నా లెజ్నోవాతో విడిపోతున్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

pawan kalyan

ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తన మూడవ భార్య తో విడిపోయావాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తుంది , అదే సమయంలో అన్నా లెజ్నోవా తన పిల్లలతో రష్యాకు తిరిగి మకాం మార్చినట్లు సమాచారం. అయితే, దీని గురించి అధికారిక ధృవీకరణ లేదు. అతని కుటుంబం కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కుటుంబ కార్యక్రమాల నుండి అన్నా లెజ్నోవా గుర్తించదగిన గైర్హాజరు అగ్నికి ఆజ్యం పోసింది. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ యాగంతో సహా వివిధ కుటుంబ కార్యక్రమాలలో ఆమె కనిపించలేదు. రామ్ చరణ్ మరియు ఉపాసన కమీని కుమార్తె పేరు పెట్టే కార్యక్రమానికి కూడా ఆమె హాజరు కాలేదు.

pk

పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజ్నోవా దాదాపు 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు, వారు లవ్ ఆజ్ కల్ యొక్క రీమేక్ అయిన తెలుగు చిత్రం తీన్ మార్ సమయంలో ఒకరితో ఒకరు డేటింగ్ ప్రారంభించారు. ఈ జంట డిసెంబర్ 2013లో వివాహం చేసుకున్నారు మరియు వీరికి ఇద్దరు పిల్లలు పోలేనా అంజనా పవనోవా మరియు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు.అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల లో ,సినిమా ల లో బిజీ గా ఉంటున్నారు ఈ సమయం లో తన భార్య పక్కన లేకుండా రష్యా వెళ్లడం దానితో పాటు పిల్ల లని కూడా తీసుకుని పోవడం తో వీరు త్వరలోనే విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

anna

వాస్తవానికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కలిసి ఉన్న తన ముగ్గురు భార్యల లో అన్న లెజ్నోవా తోనే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉన్నారు.వీరి పెళ్లి అయినా తర్వాత తన ఫ్యామిలీ లో జరిగిన అన్ని ఫంక్షన్ ల లో పాల్గొనిన ఈమె ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్ ల కి హాజరు కాకపోవడం ఇప్పుడు వస్తున్నా వార్తలకి ఆజ్యం పోస్తుంది.ఏది ఏమైనా ఎటువంటి అవినీతి ,క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ లేని పవన్ కళ్యాణ్ గారికి ఈ పెళ్లి ల విషయం ఒకటి అతి పెద్ద తల నొప్పి గా మారిన సమయం లో నిజంగానే తన మూడవ భార్య తో విడిపోతే మరి కొంత తల నొప్పి గా మారే అవకాశం ఉంది.

2768 views