Pawan kalyan: OG మరో K.G.F కానుందా ?

Posted by venditeravaartha, August 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు రాష్ట్రాల లో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ,స్టామినా తెలియని వారు ఉండరు,ఆయన ప్లాప్ సినిమా కి వచ్చిన కలెక్షన్ లు ఒక పెద్ద హీరో బ్లాక్ బస్టర్ సినిమా కలెక్షన్స్ కంటే ఎక్కువ అనేది తెలిసినదే.పది సంవత్సరాలు సరైన సక్సెస్ లేకపోయినా ఇంచ్ కూడా తగ్గని క్రేజ్ ఆయనకి మాత్రమే సాధ్యమవుతుంది.అయితే ఆజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల లో బిజీ అయినా తర్వాత మరల కం బ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్,భీమ్లా నాయక్ .బ్రో సినిమా లు సక్సెస్ అయినా
కొన్ని రాజకీయ కారణాలు వలన కమర్షియల్ గా విజయం సాధించలేక పోయాయి.చేసిన మూడు సినిమా లు రీమేక్ లు కావడం ,వైసీపీ ప్రభుత్వ విధానాల తో కలెక్షన్స్ తగ్గాయి.

pawan

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లో వారాహి యాత్ర లో ఎక్కువ సమయం కేటాయించాలి అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది,అందువలనే తాను కమిట్ అయినా హరీష్ శంకర్ ,సుజిత్ ల ఉస్తాద్ భగత్ సింగ్ ,ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (OG ) ల ను ఎంత వీలు అయితే అంత త్వరగా పూర్తి చేయాలి అనుకున్నారు కానీ వర్క్ అవుట్ కాలేదు
ఆ రెండు సినిమా ల లో హరీష్ శంకర్ సినిమా తేరి రీమేక్ అని సమాచారం ఉంది కాబట్టి తన చివరి సినిమా లు ఇచ్చిన ఫలితం ని ద్రుష్టి లో పెట్టుకుని ఈ సారి ఒరిజినల్ స్టోరీ తోనే రావాలి అని పవన్ కళ్యాణ్ తో పాటు వారి నిర్మాతలు ఆలోచన లో ఉన్నారు.ఇక ఇందుకోసం సుజిత్ డైరెక్షన్ లో రానున్న యాక్షన్ ఎంటెర్టైనెర్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ని రిలీజ్ చేయనున్నారు.

sujith

ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమా ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ స్థాయి లో రిలీజ్ చేయడానికి
ప్లాన్ చేస్తున్నారు ,సుజిత్ తన చివరి చిత్రం అయినా సాహూ స్థాయి ని మించి OG ని రెడీ
చేస్తున్నట్లు ఇండస్ట్రీ లో వినికిడి ఉంది.పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా నటించిన పంజా సినిమా బెస్ట్ స్టైలిష్ చిత్రం గా అలరించినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.పంజా తర్వాత పూర్తి స్థాయి గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ సినిమా ని కెజిఫ్ తరహా స్క్రీన్ ప్లే
ఎలివేషన్ తో డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకుని రానున్నారు అని చెప్తున్నారు,ఇక ఇదే నిజం అయితే పవన్ కళ్యాణ్ గారికి తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.

897 views