Rajamouli: రాజమౌళి 400 కోట్లు అప్పు చెయ్యడానికి కారణం అదేనా..!

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అప్పు అనేది అవసరం కోసం తీసుకునేది.మనకి ఉన్న అవసరానికి మించిన డబ్బులు కావాలి అన్నపుడు అప్పు చేస్తాం.అయితే ఇందులో చాల వరకు బ్యాంకు ల నుంచే అప్పు చేస్తాము మరి కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటారు.బ్యాంకు లలో వడ్డీ రేట్ లు తక్కువ గా ఉన్న కూడా ఎమర్జెన్సీ అవసరాలను దృష్టి లో ఉంచుకుని అధిక వడ్డీ ల కి ప్రైవేట్ సంస్థల నుంచి లోన్ లు తీసుకుంటాము.అందరిలాగానే సినిమా ఇండస్ట్రీ లోను నిర్మాతలు లోన్ లు తీసుకుని సినిమా ల ని నిర్మిస్తారు.ఒకప్పుడు నిర్మాతలు తమ దగ్గర ఉన్న డబ్బుల తో సినిమా చేసే వారు .కానీ మారుతున్న కాలానికి తగ్గట్లు సినిమా బడ్జెట్ లు పెరగడం తో నిర్మాతలు ప్రైవేట్ సంస్థల వద్ద లోన్ తీసుకుని సినిమా లని పూర్తి చేస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా ఉన్న బాహుబలి సినిమా కి కూడా ఆర్ధిక ఇబ్బందులు తప్పలేదు..

bahubali

ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా ఆర్కా మీడియా బాహుబలి(Bahubali) సినిమా కోసం మొదట 70 కోట్లా బడ్జెట్ ని అనుకోగా సినిమా స్థాయి పెరగడం తో బడ్జెట్ పెరిగిపోయింది.అనుకున్న బడ్జెట్ కి మూడు రెట్లు పెరిగిపోయింది దానితో బాహుబలి నిర్మాతలు 180 కోట్లా వరకు ప్రైవేట్ సంస్థ ల నుంచి 180 కోట్లా మేర లోన్ తీసుకున్నారు.అయితే 24 % ఉన్న వడ్డీ రేట్లకి కాకుండా 28 % కి 180 కోట్లా ని తీసుకున్న నిర్మాతలు బాహుబలి కి 150 కోట్లా వరకు ఖర్చు చేసారు..సినిమా రిలీజ్ అయినా తర్వాత రాజమౌళి గారు మాట్లాడుతూ ఈ సినిమా కోసం మా నిర్మాతలు చాల ఖర్చు చేసారు ,బడ్జెట్ పెరిగిపోయింది అని సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన నిర్మాతల కి కోలుకోలేని దెబ్బ తగిలేది అని అన్నారు.

rana prabhas

బాహుబలి సినిమా లో భల్లాలదేవ గా చేసిన రానా(Rana) ఇటీవల మీడియా తో మాట్లాడుతూ నిర్మాత ల కి ఇది చాల ప్రైమ్ టైం అని అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా బాహుబలి సినిమా కోసం
రాజమౌళి 24 % వడ్డీ కి 5 సంవత్సరాల కాలపరిమితి తో 400 కొట్ల లోన్ తీసుకున్నారు..ఆర్కా మీడియా సంస్థ యజమానులు అయినా శోభు యార్లగడ్డ ,ప్రసాద్ దేవినేని ల తో పాటు వాటా కలిగిన రాజమౌళి(Rajamouli) గారు ప్రైవేట్ సంస్థల నుంచి లోన్ తీసుకుని సినిమా ని పూర్తి చేసారు.. సినిమా దాదాపు 1800 కొట్ల కలెక్షన్ సాధించడం వలన ఊపిరి పీల్చుకున్నారు లేదు అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకున్న బయట పడలేని పరిస్థితి ఎదురు అయ్యేది.400 కొట్ల కి 24 % వడ్డీ లెక్కన 5 సంవత్సరాల కి 480 కోట్లు వడ్డీ తో కలిపి మొత్తం గా 880 కోట్లు చెల్లించారు.

1478 views