Varun tej: వరుణ్ తేజ్ కంటే ముందే ప్రేమలో పడ్డ మెగా హీరో? ఎవరో తెలుసా?

Posted by venditeravaartha, June 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ గురించే చర్చ సాగుతోంది. సైలైంట్ గా లవ్ చేసుకున్న వీరు షాకిచ్చేలా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ తరువాత ఇంకెవరు హీరోలు ప్రేమలో పడ్డారో అన్న చర్చ సాగుతోంది. అయితే వరుణ్ తేజ్ కంటే ముందే మరో మెగా హీరో స్టార్ హీరోయిన్ తో లవ్లో పడ్డారని సమాచారం. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారని అంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే వరణ్ తేజ్(Varun tej) కంటే ముందే వారు పెళ్లి చేసుకునేవారని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ అసలు విషయమేంటంటే?

sai tej

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. వీరిలో సాయి ధరమ్ తేజ్(Sai tej) ఒకరు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ హీరో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన సందర్భంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరం అయినా.. ఆ తరువాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘విరూపాక్ష’ సక్సెస్ అయింది. దీంతో ఆయన ‘బ్రో’ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి నటిస్తున్నాడు.

regina

సాయిధరమ్ తేజ్ డెబ్యూ మూవీ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో రెజీనా హీరోయిన్. ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్ష్ తెచ్చుకోవడంతో సక్సెస్ కపుల్స్ గా పేరు వచ్చింది. దీంతో వీరు మరోసారి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా కూడా కాస్త పేరు తెచ్చుకుంది. ఇలా రెండు సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య చనువు పెరిగిందని అంటున్నారు. మరికొందరైతే సినిమాలతో సంబంధం లేకుండా బయట కూడా కలుసుకునేవారని ప్రచారం చేస్తున్నారు.

virupaksha

ఆ మధ్య ఓ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘కొన్ని కారణాల వల్ల నా బెస్ట్ ఫ్రెండ్ ను వదులుకోవాల్సి వచ్చింది..’అని చెప్పాడు. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు.. రెజీనానే అని కొందరు అంటున్నారు. వీరిద్దరు ప్రేమ వరకు వెళ్లారని, కానీ అనుకోకుండానే విడిపోయారని అంటున్నారు. ఒకవేళ అలాగే కొనసాగితే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల కంటే ముందుగానే పెళ్లి చేసుకునేవారని చర్చించుకుంటున్నారు.

sai and varun

963 views