Samantha-Vijay Devarakonda: సమంత ,విజయ్ దేవరకొండ ల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి?

Posted by venditeravaartha, July 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల లో ఒకరు సమంత,2010 లో రిలీజ్ అయినా ఏమాయ చేసావే మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తెలుగు ,తమిళ్ ల లో ఉన్న పెద్ద హీరో ల తో సినిమా లు చేసి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.గత కొంత కాలం గా సరైన సక్సెస్ లేని సమంత గారు ఇప్పుడు తన ఆశలు అన్ని విజయ్ దేవరకొండ ఖుషి మూవీ మీదనే పెట్టుకుని ఉన్నారు.నాగచైతన్య గారితో విడిపోయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ తో సమంత సన్నిహితంగా ఉంటున్నారు అంటూ కొంత మంది ఇది వరకే కామెంట్స్ చేసారు.

samantha

సమంత ,విజయ్ దేవరకొండ మొదట సారిగా మహానటి సినిమా లో కలిసి నటించారు అయితే ఇందులో వీరి ఇద్దరి మధ్య వచ్చే సీన్ లు తక్కువ ఉన్నపటికీ సమంత గారితో మంచి స్నేహం ఏర్పడింది అని విజయ్ చాల సార్లు చెప్పారు.డైరెక్ట్ గా నాగచైతన్య ముందే నువ్వు సమంత ని పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటె నేను ఖచ్చితంగా సామ్ ని పెళ్లి చేసుకుని ఉండే వాడిని అని అందరి ముందు విజయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమే చేసాయి.

mahanati

మహానటి తర్వాత విజయ్ ,సమంత లు కలిసి చేస్తున్న సినిమా ఖుషి ,లవ్ స్టోరీ ల కు పెట్టిన పేరు అయినా శివ నిర్వాణ గారు ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తున్నారు.పాన్ ఇండియన్ మూవీ గా రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే..
మొదట పాట మంచి మెలోడీ తో అందముగా చూపించిన దర్శకుడు ఇటీవల రిలీజ్ అయినా సాంగ్ లో మాత్రం సమంత ,విజయ్ ల మధ్య మంచి రొమాంటిక్ సీన్ లు ఉన్నట్లు హింట్ ఇచ్చిన విధంగా సాంగ్ లో కొన్ని సీన్ ల ను ఉంచారు.

khushi

అయితే ఖుషి సినిమా ముందు నుంచే సమంత గారితో మంచి స్నేహం ఉంది అని విజయ్ దేవరకొండ చాల సందర్భాల లో చెప్పారు.తన బర్త్ డే అప్పుడు కూడా స్పెషల్ గా వెళ్లి విష్ చేసిన విజయ్ ఆమెతో హాలిడే ల కి వెళ్లిన ఫోటో ల ని సైతం తన ఇస్టాగ్రమ్ ద్వారా షేర్ చేసిన ఫోటో లు కూడా ఉన్నాయి.సమంత గారికి ఇటీవల అనారోగ్య సమస్యలు వచ్చినపుడు విజయ్ తనకి సపోర్ట్ గా నిలిచాడు అని సమంత చెప్పారు కూడా ,అయితే వారి మధ్య ఉన్న స్నేహం ని మీడియా వాళ్ళు వేరే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.అలానే విజయ్ కూడా తనకి సామ్ బెస్ట్ ఫ్రెండ్ అని మీడియా లో వచ్చే వాటిని పట్టించుకోమన్నారు.

sam and vijay

2437 views