Niharika-Lavanya: నిహారిక కోసం త్యాగం చేసిన లావణ్య త్రిపాఠి.. ఏం చేసిందంటే?

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా హీరో నాగబాబు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఇటీవల జోరందుకుంటున్నాయి. ఓ వైపు ఆయన డాటర్ నిహారిక(Niharika) భర్తతో విడాకులు తీసుకుంటున్నారని అంటుండగా.. మరోవైపు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయాలపై ఎవరూ క్లారిటీ ఇవ్వాలేదు. కానీ వీర గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. లేటేస్టుగా మరో హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుంటే నిహారిక ఆమకు ఆడిబిడ్డ అవుతోంది. ఆమె శ్రేయస్సు కోసం ఇప్పటికే పెద్ద త్యాగం చేసిందట. అయినా నిహారిక మాట వినకపోవడంతో ఆమె గురించి పట్టించుకోవడం మానేసిందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

niharika

‘అందాల రాక్షసి’ అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి(Lavanya tripati) ఆ తరువాత అగ్ర హీరోల పక్కన నటించింది. వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత ‘అంతరిక్షం’ అనే మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఈక్రమంలో వీరిద్దరి మనసులను కలిశాయి. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్థం ఉంటుందని ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు జోరుగా వార్తలను ప్రసారం చేస్తున్నారు. కానీ వీరిద్దరు మాత్రం ఎటువంటి కామెంట్ చేయడం లేదు. వీరిద్దరి మధ్య ఏం లేకపోతే కనీసం ఖండించాలి కదా.. అని కొందరు అంటున్నారు.

varun lavanya

ఇదే సమయంలో మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్(Varun tej) ల పెళ్లి ఎప్పుడో అయిపోయేదట. అయితే నిహారిక విడాకులపై కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది. ఆమె విడాకులు తీసుకుంటుందని కొందరు అంటుండగా.. అలాంటిదేమీ లేదని మరికొందరు అంటున్నారు. నిహారిక మాత్రం భర్తతలో ఉండకుండా జలపాతాల వద్దకు ఓన్ గా వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. అయితే నిహారికను తన భర్తతో కలిపి వారిద్దరి సంసారం చక్కబడ్డాగా మనం పెళ్లి చేసుకుందాం.. అని లావణ్య వరుణ్ తేజ్ తో చెప్పిందట.

lavanya with varun

ఇలా కొంతకాలం వెయిట్ చేసిన తరువాత కూడా నిహారికలో మార్పు రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఇక పెళ్లికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. నిహారిక ఎంత చెప్పినా వినకుండా విడాకులు తీసుకోవడానికే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కోసం వెయిట్ చేస్తే తమ జీవితాలు బాగుపడవు.. అన్నట్లుగా వీరి పెళ్లికి ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని అంటున్నారు. మరి ఈ విషయంపైనా అయినా స్పందిస్తారా? చూడాలి.

2308 views