Lavanya :వీళ్లు మారరు ఇక.. వరుణ్​ తో పెళ్లి.. మూడో వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లావణ్య

Posted by RR writings, January 11, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Lavanya: ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఐదేళ్ల పాటు తమ ప్రేమను గోప్యంగా ఉంచిన ఈ జంట నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కి కూడా వెళ్లారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. లావణ్య త్రిపాఠి తన పెళ్లి దుస్తులలో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ కాస్ట్యూమ్స్‌పై అందరూ కూడా పాజిటివ్‌గా కామెంట్ చేశారు. ఈ క్రమంలో తన పెళ్లికి డ్రెస్ లను డిజైన్ చేసిన మనీష్ మెల్హోత్రాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. పెళ్లయిన 2 నెలల తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది.

లావణ్య-వరుణ్ ల పెళ్లికి ప్రత్యేకంగా డ్రెస్సులు డిజైన్ చేసిన మనీష్ మెల్హోత్రాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు ప్రస్తుతం లావణ్య వరుస సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంది. ఆమె అనుకున్నట్టుగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. వరుణ్ కూడా చాలా సినిమాలతో బిజీ..!!

583 views