ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదలైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ తమ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించింది. మొదటి భాగం ‘వార్’ బ్లాక్‌బస్టర్ కావడంతో, సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా ఈసారి సౌత్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్‌ను సెకండ్ హీరోగా తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్
తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. రిలీజ్ రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. కానీ రెండో రోజు (ఆగస్టు 15) హాలిడే ఉన్నప్పటికీ కాస్త డ్రాప్ నమోదైంది. మూడో రోజుకి మరింతగా తగ్గింది.
3 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ (తెలుగు వెర్షన్)
థియేట్రికల్ బిజినెస్: ₹87.5 కోట్లు
బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹88 కోట్లు షేర్
3 రోజుల్లో షేర్: ₹35.61 కోట్లు
3 రోజుల్లో గ్రాస్: ₹66.8 కోట్లు
బ్రేక్ ఈవెన్‌కు మిగిలింది: ₹52.39 కోట్లు షేర్
విశ్లేషణ
ఇక ఆదివారం హాలిడేను గట్టిగా వాడుకోవాలి. లేదంటే వచ్చే వారంలో వీక్‌డేస్‌లో ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం కష్టమే. తెలుగు మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం కోసం ‘వార్ 2’కు మరింత స్ట్రాంగ్ రన్ అవసరం.