VISHNUPRIYA:నాకు తను అంటే పిచ్చి ప్రేమ ! ఆంటీ ఒకే అంటే పెళ్లి చేసుకుంటా అంటున్న విష్ణు ప్రియ.

Posted by venditeravaartha, May 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బుల్లి తెర యాంకర్ ల లో విష్ణుప్రియ కి సెపరేట్ స్టైల్ ఉంది,పొడుగు కాళ్ల తో అటు కామెడీ ,డాన్స్ ల లో మంచి నేర్పరి అయినా ఈ హాట్ యాంకర్ మాట్లాడే మాటలు కానీ ,ఆమె చేసే కామెంట్ లు కానీ బాగా వైరల్ అవుతాయి.ఈ మధ్య కాలం లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి ప్రైవేట్ సాంగ్ ల తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది విష్ణుప్రియ.రీసెంట్ గా రిలీజ్ అయినా ‘గంగులు’ పాట కి మంచి స్పందన లభిస్తుంది.అయితే ఈ మధ్య తాను ఒక టీవీ ప్రోగ్రాం లో చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మా టీవీ లో ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ ప్రోగ్రాం లో ఏప్రిల్ 30 నా ప్రసారం అయినా షో లో యాంకర్ రవి తో పాటు గా విష్ణుప్రియ పాల్గొన్నారు,ఈ షో కి హోస్ట్ గా ఓంకార్ గారు చేస్తున్నారు
ప్రోగ్రాం మధ్య లో మీకు ఎవరు అయినా క్రష్ ఉన్నారా అని అడిగిన ప్రశ్న కు సమాధానం గా విష్ణుప్రియ మాట్లాడుతూ ‘జేడీ చక్రవర్తి ‘ అంటే నాకు చాల ఇష్టం ,అతని ని చాల ఘాడం గా ప్రేమిస్తున్న అని చెప్పింది,జేడీ గారి తో మీకు ఇలా పరిచయం ,ఆ ప్రేమ పెళ్లి గా మారనుందా అని అడిగిన ప్రశ్న కి ఒక వెబ్ సిరీస్ కోసం జేడీ గారితో 40 డేస్ వర్క్ చేయాల్సి వచ్చింది,ఆ టైం లో ఆయనతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ గా మారింది,అయన కి నా ప్రేమ విష్యం చెప్పను ,త్వరలోనే అయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది.జేడీ గారి వాళ్ళ అమ్మ గారు ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలి గా వెళ్తాను అని చెప్పింది.

శివ సినిమా తో సినిమా లోకి వచ్చిన జేడీ చక్రవర్తి మొదట్లో సైడ్ క్యారక్టర్ లు ,విల్లన్ గా చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి సినిమా ల లో హీరో గా పరిచయం అయ్యి సెన్సషనల్ హిట్లు అయినా మనీ , గులాబీ ,మనీ మనీ ,ఎగిరే పావురమా ,బొంబాయి ప్రియుడు వంటి సినిమా లో నటించారు,హిందీ లో లో ఆల్ టైం హిట్ ల లో ఒకటి అయినా ‘సత్య’ లో నటించి హిందీ సినిమా లో కూడా బిజీ అయిపోయారు.ఈ మధ్య సినిమా ల కి దూరం గా ఉన్న జేడీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.2016 లో నటి అనుకృతి గోవింద్ శర్మ తో పెళ్లి అయింది.

1836 views