VIRUPAKSHA:సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతున్న ‘విరూపాక్ష’

Posted by venditeravaartha, April 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరో గా నూతన దర్శకుడు కార్తీక్ డైరెక్షన్ లో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమా విరూపాక్ష ,21 ఏప్రిల్ న విడుదల కు రెడీ గా ఉంది,ప్రొమోషన్ ల లో భాగం గా సాయి తేజ్ మొన్న హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ ,ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో కామెంటరీ లో కూడా పాల్గొని హల్చల్ చేసారు,టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకు మంచి జోరును కొనసాగించింది చిత్రబృందం. రెగ్యులర్‌గా విడుదలయ్యే ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఆక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ నటిస్తున్న చిత్రం కావడం ,ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్ లు ప్రేక్షకులని మెప్పించాయి, దాంతో ఈ సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి, సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది. విడుదల రోజున ట్రేడ్ భారీ అంచనాలు నెలకొనడంతోపాటు మరో రెండు రోజులు హాలీడేస్ కావడంతో పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు మరో భారీ అడ్వాంటేజ్. కానీ, సన్నిహిత నివేదికల ప్రకారం, ఈ చిత్రం దాని సెలబ్రిటీ ప్రీమియర్ నుండి సూపర్ పాజిటివ్ టాక్‌ను పొందింది.

సినీ ఇండస్ట్రీ లో ని ప్రముఖ వ్యక్తుల కోసం ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించబడింది ,ఈ సినిమా చుసిన సినీ ప్రముఖులు అందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, మిస్టీరియస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా గ్రిప్పింగ్ నేరేషన్ తో థ్రిల్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యిందని అంటున్నారు. సినిమా ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. BGM మరియు సినిమాటోగ్రఫీ విభాగాలు చిత్రానికి మరింత విలువను జోడించాయి మరియు అవి గట్టి కథనంతో పాటు ప్రధాన హైలైట్‌లుగా చెప్పబడుతున్నాయి.
మొత్తానికి సాయి తేజ్ కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దక్కిందే చెప్పొచ్చు,తెలుగు సినిమా స్థాయి ని మరో స్థాయి కి తీసుకుని వెళ్లే సినిమా గా విరూపాక్ష ఉండబోతుంది.

1430 views