VIRUPAKSHA:కార్తికేయ 2 బాట లోనే విరూపాక్ష

Posted by venditeravaartha, April 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన విరూపాక్ష సినిమా తెలుగు రాష్ట్ర ల లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది,సాయి తేజ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న విరూపాక్ష మూవీ నిఖిల్ సిద్దార్ధ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ 2 ‘ ని ఫాలో అవుతుంది.

2022 లో రిలీజ్ అయినా కార్తికేయ 2 ,తెలుగు లో ఎంత పెద్ద హిట్ అయిందో దానికి రెట్టింపు బాలీవుడ్ లో హిట్ అయింది,దానికి కారణం ఏది అయినప్పటికీ నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవ్వాలని చుస్తునారు విరూపాక్ష టీం,రిలీజ్ అయినా 6 రోజుల లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన విరూపాక్ష ఇప్పుడు హిందీ బాషా లో ను రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఏప్రిల్ 21 నా రిలీజ్ అయినా విరూపాక్ష తెలుగు రాష్ట్ర ల లో మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది,మొదట పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ చేయాలి అనుకున్న హిందీ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసి కి భాయ్ కిసి కా జాన్ ‘ సినిమా రిలీజ్ ఉండటం తో అక్కడ రిలీజ్ ని ఆపేసారు,ఆ సినిమా ఆశించిన స్థాయి లో ఆడకపోవడం తో ఇప్పుడు విరూపాక్ష టీం హిందీ లో మూవీ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు,సినిమా లో ఉన్న కంటెంట్ , హార్రర్ సీన్ లు,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హిందీ ప్రేక్షకుల కి బాగా నచ్చుతాయి అని టీం ఆశిస్తున్నారు,ఒక వేళా అదే జరిగి హిందీ లో పాజిటివ్ టాక్ వస్తే సాయి తేజ్ కెరీర్ లో 100 కోట్ల సినిమా పడేలా ఉంది అంటున్నారు.

1009 views