VINAYAK-PRABHAS:బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ లో ప్రభాస్ ని మించిపోయాడు! హిందీ ఛత్రపతి సినిమా రిలీజ్ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసిన వి వి వినాయక్ !

Posted by venditeravaartha, May 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ డైరెక్టర్ లు ఉన్న వి వి వినాయక్ గారిది సెపెరేట్ స్టైల్ ,ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఆది తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వినాయక్ తర్వాత వరుసగా చెన్నకేశవ రెడ్డి ,దిల్ ,ఠాగూర్ సినిమా ల తో టాప్ డైరెక్టర్ ల లో లిస్ట్ లో చేరారు.వినాయక్ గారికి ఉన్న ప్రత్యక స్టైల్ రీమేక్ సినిమా ని ఒరిజినల్ కి మించిన స్థాయి లో తీయడం ,చిరంజీవి గారి తో తీసిన రెండు సినిమా లు రీమేక్ లు అయినా ‘ఠాగూర్’,’ఖైదీ 150 ‘ లు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఖైదీ తర్వాత సాయి తేజ్ గారితో ఇంటలెజెంట్ సినిమా తో డిజాస్టర్ అందుకున్న వినాయక్ 5 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు ఛత్రపతి తో మే 12 నా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.తెలుగు లో సరైన హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ ని హిందీ లో ఇంట్రడ్యూస్ చేస్తున్న వినాయక్ హీరో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.హిందీ ఛత్రపతి ప్రొమోషన్ ల లో వినాయక్ మాట్లాడుతూ 2005 లో రిలీజ్ అయినా ప్రభాస్ ఛత్రపతి ని ఇప్పటి యువత చాల వరకు చూసి ఉండరు ,వారు ఇప్పుడు రాబోతున్న ఛత్రపతి ని చూసి చాల ఎంజాయ్ చేస్తారు ,ఆ ఛత్రపతి ని చూసినవారు దానిని చెడకొట్టలేదు అని అంటారు.

అప్పటి వరకు ప్రభాస్ కి ఉన్న రేంజ్ ని రెట్టింపు చేసిన ఛత్రపతి ఇప్పుడు శ్రీనివాస్ కి కూడా అదే స్థాయి లో హెల్ప్ అవుతుంది.అల్లుడు శీను అప్పుడు చూసిన శ్రీనివాస్ కి ఛత్రపతి సినిమా లో చూసిన తనకి చాల తేడా ఉంది.ప్రతి సినిమా కి తన ని తాను మార్చుకుంటూ వచ్చిన శ్రీనివాస్ ఈ సినిమా లో తాను చేసిన యాక్షన్ సీన్ లు ,ఎమోషనల్ సీన్ లు ప్రభాస్ ని గుర్తు చేస్తాయి.నటన లో ప్రభాస్ తో పోల్చలేము కానీ దాదాపు ఆ స్థాయి లోనే నటించారు.శ్రీనివాస్ కి ,నాకు ఈ సినిమా హిందీ లో మంచి బ్రేక్ ఇస్తుంది అని అనుకుంటున్నాము అన్నారు.

14147 views