VIJAY:ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దళపతి విజయ్! 24 గంటల లోనే ఇండియా లోనే టాప్

Posted by venditeravaartha, April 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియా లో ఉన్న టాప్ సూపర్ స్టార్ ల లో ఒకరు ‘దళపతి విజయ్ ‘ఈ మధ్య కాలం లో రిలీజ్ అయినా తన సినిమా లు అన్ని కూడా 200 కోట్ల పైన నే కలెక్ట్ చేసాయి,విజయ్ అందరి సూపర్ స్టార్స్ ల కాకుండా సోషల్ మీడియా కి దూరం గా ఉంటారు.అయితే ఏప్రిల్ 2 నా విజయ్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ లో తన అకౌంట్ ని ఓపెన్ చేసారు,”హలో నన్బా అండ్ నంబిస్”తో తన అరంగేట్రం చేసాడు.విజయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చేరిన గంటలోపే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్లను మిలియన్స్ కి పెంచుతోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ‘లియో’ షూటింగ్‌లో ఉన్న విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్నాడు.

దళపతి విజయ్ ఇన్‌స్టా ఖాతాను తెరవడంతో, అతని పాపులారిటీ ,దానితో తీసుకువచ్చే భారీ సినిమా ప్రచారం ఖచ్చితంగా తన రాబోయే సినిమా ల మీద ప్రభావం తీసుకుని వస్తుంది .ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న విజయ్, కొంతకాలం విరామం తీసుకున్నాడు, కాబట్టి అతని ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించడం అతనికి ఫోటోలను పోస్ట్ చేయడానికి మరియు తన సినిమాలను ప్రమోట్ చేయడానికి కొత్త మార్గంగా పరిగణించబడుతుంది.

దళపతి విజయ్‌కి ఫేస్‌బుక్‌లో 7.8 మిలియన్లు మరియు ట్విట్టర్‌లో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన 24 గంటల లోపు 4 .5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు,ఇండియా నుంచి 24 గంటల లో అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన అకౌంట్ గా విజయ్ రికార్డు సృష్టించారు, తన ‘లియో’ సినిమా లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, శాండీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ మరియు మలయాళ నటుడు మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు.దసరా పండగ సందర్బముగా పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ కి రెడీ కాబోతోంది లియో.

337 views