Vijay Devarakonda : రౌడీ హీరో కొత్త లవర్ ని పట్టాడు గా? మరి రష్మిక పరిస్థితి ఏంటో పాపం ???

Posted by venditeravaartha, March 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పెళ్లిచూపులు సినిమా తో సోలో హీరో గా పరిచయం అయినా విజయదేవరకొండ మంచి హిట్ ని సాధించాడు ,ఆ తర్వాత రిలీజ్ అయినా కొన్ని సినిమా లు అంతా అంతా మాత్రాన ఆడినప్పటికీ ,’అర్జున్ రెడ్డి ‘ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు, ఇక గీత గోవిందం సినిమా తో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న మొదటి టైర్ 2 హీరో గా రికార్డు ల లోకి ఎక్కారు , ఇక ఈ సినిమా నుంచి హీరోయిన్ రష్మిక తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమ గా మారింది అని ,అందువల్లే ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా రిషబ్ శెట్టి తో బ్రేక్ అప్ చేసుకుంది రష్మిక అని అప్పట్లో బాగా న్యూస్ హల్ చల్ చేసింది ,దానికి తగ్గట్టే రష్మిక ,విజయ్ కూడా పలు సందర్భాల లో కలిసి తిరగడం ,బయట కలవడం వంటివి ఈ వార్తల కు బలం చేకూర్చాయి. ఈ మధ్య రష్మిక తాను హాలిడే ట్రిప్ లో భాగంగా మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు , తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ వీడియో లో ఉన్నపుడు పక్కన విజయ్ దేవరకొండ వాయిస్ వచ్చిన వీడియో తో వారి ప్రేమయం కంఫర్మ్ అయింది అనే చెప్పాలి.

అయితే రష్మిక ఈ రూమర్స్‌పై రియాక్ట్ అవుతూ.. మేము ఇద్దరం ఫ్రెండ్స్, దేనికైనా ఒక లిమిట్ ఉంటుందంటూ రష్మిక వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే పలు మార్లు వీరిద్దరు కలిసి కనిపించడంతో రూమర్స్ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తాజాగా రష్మిక, విజయ్ బ్రేకప్ చెప్పుకున్నారని.. ఇప్పుడు విజయ్ కొత్త లవర్‌ని పట్టాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

ఓవర్సీస్ క్రిటిక్‌గా భావించే ఉమైర్ సంధు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ రిలీజ్ చేశాడు. ‘‘రష్మిక మందన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ దేవరకొండ తన కొత్త టైమ్‌పాస్ ప్రేమను వెతుకున్నాడు. ‘ఖుషి’ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో సమంతతో విజయ్ ప్రేమలో పడ్డాడు. శ్రీనగర్‌లోని ఓ హోటల్‌ గదిలో కలిసి బస చేశారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కాగా.. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి చూద్దాం ఖుషి సినిమా వరకు ఉంటుందా ? లేక సినిమా అయిపోయాక కూడా విజయ్ దేవరకొండ ,సమంత మధ్య ఇలాంటి రిలేషన్ ఉంటుందా ?

869 views