Vijay Devarakonda:ఆ స్టార్ హీరోకి తండ్రిగా నటించనున్న విజయ్ దేవరకొండ!

Posted by venditeravaartha, May 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Vijay Devarakonda: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో కి ఉండాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయనకి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ తో అలరించిన ఆయన,పెళ్లి చూపులు సినిమాతో హీరో గా మారాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వెంటనే విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాతనే విజయ్ దేవరకొండ కి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో విజయ్ దేవరకొండ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది.

ఈ సినిమా తర్వాత టాక్సీ వాలా అనే చిత్రం కూడా హిట్ అయ్యింది కానీ , ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. విజయ్ దేవరకొండ స్థానం లో వేరే హీరో ఉండుంటే ఈపాటికి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయేవారు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదల ఫ్యామిలీ స్టార్ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. దీంతో ఇక నుండి చెయ్యబోయే సినిమాల విషయం లో విజయ్ దేవరకొండ ఆచి తూచి అడుగులు వెయ్యాలని చూస్తున్నారు.

అందులో భాగంగానే ఆయన తన తదుపరి చిత్రాన్ని శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ దర్శకత్వం లో నటించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కథ 1850 కాలం లో జరుగుతుందట. బ్రిటీష్ కాలం లో జరిగే ఈ కథలో విజయ్ దేవరకొండ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడట. ఈ రెండు పాత్రలు కూడా టాలీవుడ్ లో ట్రెండ్ ని సెట్ చేసే విధంగా ఉంటుందని టాక్. అయితే విజయ్ దేవరకొండ తన ప్రతీ సినిమాలో డైలాగ్ మోడ్యులేషన్ ఒకేలా ఉందని, ఇది మార్చుకోకపోతే ఆయన కెరీర్ పోతుందని క్రిటిక్స్ అనేక రివ్యూస్ ఇచ్చారు. మరి ఈ సినిమాలో ఆయన దానిని మార్చుకుంటాడో లేదో చూడాలి.

313 views