VIJAY DEVARA KONDA:విజయ్ దేవరకొండ కి అంత సీన్ లేదు అని మండి పడుతున్న నెటిజన్లు!

Posted by venditeravaartha, May 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పెళ్లి చూపులు సినిమా తో హీరో గా అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ,అర్జున్ రెడ్డి సినిమా నుంచి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ను మంచి గుర్తింపు లభించింది.అయితే మొదట్లో పెళ్లి చూపులు ,ద్వారకా ,అర్జున్ రెడ్డి ,గీత గోవిందం ,టాక్సీవాలా వంటి హిట్లు రావడం తో ఒక్క సారిగా విజయ్ దేవరకొండ కి ఇండియా అంతటా మంచి ఫ్యాన్ బేస్ తో పాటు అవకాశాలు మంచిగా వచ్చాయి ,కానీ వరల్డ్ ఫేమస్ లవర్ ,Dear Comrade ,లైగర్ వంటి డిసాస్టర్ లు రావడం తో ఇప్పుడు సక్సెస్ కోసం మరో లవ్ స్టోరీ వైపు చూస్తున్నాడు విజయ్,నిన్ను కోరి ,మజిలీ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శివ నిర్వాణ కలయిక తో మోస్ట్ బ్యూటిఫుల్ ‘సమంత’ హీరోయిన్ గా ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నపటికీ ‘ఖుషి’ సినిమా పోస్టర్ మీద ఇప్పుడు నెట్టింట నెగటివ్ ట్రోల్ల్స్ వస్తున్నాయి ,దానికి కారణం విజయ్ దేవరకొండ పేరు.ఖుషి మూవీ పోస్టర్ లో హీరో ,హీరోయిన్ పేర్ల తో పాటు గా డైరెక్టర్ పేరు కూడా వేశారు,అయితే ‘ది విజయ్ దేవరకొండ’ అని పోస్టర్ మీద పేరు ఉండటం తో విజయ్ ఈ ట్రోల్ల్స్ కి గురి అవుతున్నాడు.బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ,సల్మాన్ ఖాన్ ,షారుఖ్ ఖాన్,సూపర్ స్టార్ రజిని కాంత్,కమల్ హాసన్,మెగాస్టార్ చిరంజీవి లాంటి సూపర్ స్టార్ లు కూడా ఎప్పుడు తమ పేర్ల కి ముందు ‘ది’ అని పెట్టుకోలేదు అలాంటిది ఒక 3 హిట్లు ఉండి ,సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ అలా పెట్టుకోవడం ఏంటి అనిఅంటున్నారు.అయితే పోస్టర్ డిజైన్ చేసే వారు అయినా ఆలోచించి చేయాలసింది అని కొంత మంది వాదన.తన కంటే ముందు వచ్చిన యువ హీరో లు అయినా ‘నిఖిల్’,నితిన్ ,నాని ,వరుణ్ తేజ్ ,సాయి తేజ్ ,నాగ చైతన్య ల ని చూసి అయినా విజయ్ దేవరకొండ తన ఆటిట్యూడ్ ని తగ్గించుకుని సినిమా లు చేస్తే హిట్లు అవే వస్తాయి అని మరి కొందరి అభిప్రాయం.

1691 views