Venkatesh:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకటేష్ కొడుకు..ఏ రేంజ్ లో తయారయ్యాడో మీరే చూడండి!

Posted by venditeravaartha, March 11, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Venkatesh : దగ్గుపాటి వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ చాలా ఉంది.కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో వెండితెరకు పరిచయం అయ్యాడు. తండ్రి రామానాయుడు అన్న సురేష్ బాబు వెంకటేష్ ను మొదటి నుంచి సపోర్టుగా నిలబడ్డారు. వెంకటేష్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని తెలుగు ఇండస్ట్రీలో,శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో మహిళా అభిమానులు కలిగిన హీరోగా, సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

దశాబ్దాల కాలం నుండి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. ఈయన సినిమాల మీద ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు దర్శకులు నిర్మాతలకు ఈయన సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ అని అనుకుంటారు. అలా విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న స్టార్ హీరో మన విక్టరీ వెంకటేష్ గారు.రీసెంట్గా సైంధవ్ మూవీ లో నటించి అలరించారు.

తెలుగు సినీ హీరోలందరి వారసులు ఇండస్ట్రీలో ఇంటర్ ఇవ్వాలని వారి అభిమానులు కోరుకుంటుంటారు.మహేష్ బాబు కొడుకు గౌతమ్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అప్పుడప్పుడు ఏదో ఒక షోలోనో లేదంటే యూట్యూబ్లో దర్శనమిస్తూ బయట కనిపిస్తూ ఉంటారు. కానీ వెంకటేష్ కొడుకు అర్జున్ రామ్నాథ్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెరుగుతున్నాడు ఇంతవరకు అర్జున్ ఎలా ఉంటాడో కూడా బయట ప్రపంచానికి తెలియదు ఒకటి రెండు సందర్భాలు తప్ప అర్జున్ ఫోటో కూడా బయటకి రిలీజ్ అయిన దాఖలాలు లేవు. వెంకటేష్ కుటుంబ సభ్యుల వివరాలను ఎప్పుడు బయట ప్రస్తావించరు.

ఇక తన కొడుకు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ కూడా ఇప్పట్లో అయితే లేనట్టే అని క్లారిటీ ఇచ్చారు వెంకటేష్ ఇదో కాకపోతే నాలుగు సంవత్సరాలు తర్వాత అయినా ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు ఇప్పటికీ పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి ఇక హీరో వారసులైన కనీసం సంవత్సరానికి రెండు సినిమాలతో అలరించాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.మరి వెంకటేష్ గారి వారసుడు ఎంట్రీ ప్రస్తుతానికి లేనట్టే.

308 views