Niharika : నిహారిక భవిష్యత్ పై వేణు స్వామి సంచలన కామెంట్స్.. నిజమేనా?

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా డాటర్ నిహారిక విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అమె అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి అమె గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాను.. ఇక నన్ను వదిలేయండి.. మీకు దణ్ణం పెడుతాను.. అని వేడుకున్నా.. చాలా మంది విడిచిపెట్టడం లేదు. కొందరు ట్రోలర్స్ కొత్త కొత్త విషయాలను బయటకు తెస్తూ రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా ఆమె విడాకుల విషయంలో వేణు స్వామిని రంగంలోకి తీసుకొచ్చారు. నిహారిక గురించి వేణుస్వామి (Venu swamy) సంచలన కామెంట్లు చేశారని అంటున్నారు. ఇంతకీ వేణుస్వామి నిహారిక గురించి ఏమన్నాడంటే..?

venu-swamy-comments-on-niharika-chaitanya-divorce

వేణుస్వామి పలువురి జాతకాలు డబ్బులు తీసుకోకుండానే బహిరంగం చేస్తుంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ల జాతకాలు ఆయనను ఎవరూ అడక్కపోయినా చెబుతారు. ఇప్పటి వరకు ఆయన కొందరు సెలబ్రెటీల జాతకాలు బయటపెట్టారని అంటున్నారు. అవి నిజమయ్యాయని ఆధారాలతో చూపించారు. అయితే అందరి జాతకాల్లో ఇది సాధ్యమవుతుందా? అని కొందరు ప్రశ్నలు వేస్తుంటారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు నిహారిక (Niharika)  విషయంలో కూడా వేణు స్వామి జోక్యం చేసుకున్నాడని కొందరు అంటున్నారు. గతంలో వేణుస్వామి చెప్పినట్లే నిహారిక-చైతన్య (Chaithanya) విడాకులు తీసుకున్నారని అంటున్నారు. అలాగే నిహారిక ఇక ఎవరితో పెళ్లి చేసుకున్నా.. ఎక్కువ కాలం ఉండదని, ఆమె జీవితాంతం ఒంటరిగానే ఉండాల్సి వస్తుందని చెప్పాడట.

venu-swamy-comments-on-niharika-chaitanya-divorce

నిహారిక జాతకంలో ఏదో దోషం ఉందని, అందువల్ల ఆమె జీవితంలో ఎవరినీ పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకోవడం తథ్యమని అంటున్నారు. ఇది వేణుస్వామి చెప్పాడని కొందరు పోస్టులు పెట్టడంతో అది వైరల్ గా మారింది. అయితే మెగా ఫ్యాన్స్ దీనిని కొట్టిపారేస్తున్నారు. వేణుస్వామి అలా చెబితే అందుకు సంబంధించిన వీడియో ఉండాలి కదా.. ఎలాంటి ఆధారం లేకుండానే కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయతే వేణుస్వామి కొందరు సెలబ్రేటీలపై కలగజేసుకుంటాడు. ఇందులో భాగంగానే ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆయన పేరును వాడుతున్నారని అంటున్నారు. అయితే దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags :
3574 views