Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి అధికారిక ప్రకటన

Posted by venditeravaartha, June 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అనుకున్నట్లే జరిగింది.. ఇన్నాళ్లు తమపై వస్తున్న వార్తలను వారు నిజం చేశారు.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో జంట ఒక్కటి కాబోతుంది.. మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej ), హీరోయిన్ లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )లు ఒక్కటి కాబోతున్న విషయం వారు అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వచ్చాయి. కానీ వరుణ్ తేజ్ గానీ.. లావణ్య గానీ.. స్పందించలేదు. దీంతో అసలు నిజంగానే వీరు పెళ్లి చేసుకుంటున్నారా? లేక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారా? అనే అనుమానాలుండేవి. కానీ తాజాగా వీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్.. నటుడు, నిర్మాత నాగబాబు కుమారుడు. ఈయన ‘ముకుంద’ సినిమాతో సినీ ఆరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించారు. ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో మాస్ హీరో అనిపించుకున్నాడు. ‘మిస్టర్’ అనే మూవీతో లవర్ బాయ్ అని పేరు తెచ్చుకున్నాడు.

Varun-Tej-Lavanya-Engagement

అయితే వరుణ్ తేజ్ పెళ్లి పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ నాగబాబు( Nagababu ) ఫ్యామిలీ నుంచి సరైన క్లారిటీ రాకపోవడంతో అయోమయంగా ఉండేది. అటు లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ కు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే అమెకు సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు ఆమె చదువు పూర్తయ్యాక మోడల్ రంగంలో అడుగుపెట్టారు. 2006లో ‘మిస్ ఉత్తరాఖండ్’ టైటిల్ ను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగులో ‘అందాల రాక్షసి’ అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. లావణ్య నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. వీటిలో భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి వి ఉన్నాయి.

Varun-Tej-Lavanya-Engagement

వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య ‘మిస్టర్’ సినిమాలో నటించింది. ఆ తరువాత ‘అంతరిక్షం’ అనే మూవీ చేస్తున్న సమయంలో వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో ఈ విషయం చెప్పడంతో ఓకే చెప్పారు. గతంలో నాగబాబు వరుణ్ ను త్వరలో పెళ్లి కొడుకుగా చూడబోతున్నారంటూ హింట్ ఇచ్చారు. కానీ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఇక వీరి పెళ్లి విషయం తాజాగా అధికారికంగా నాగబాబు కుటుంబ సభ్యులు ప్రకటించినట్లు తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లుగానే వీరి నిశ్చితార్థం 9న అతి కొద్ది మంది సమక్షంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Tags :
1788 views