Varun tej -Lavanya: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి !

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ గా పేరు ఉన్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej),2014 లో రిలీజ్ అయినా ముకుంద(Mukunda) చిత్రం ద్వారా హీరో గా పరిచయం అయినా వరుణ్ తేజ్ తనకంటూ సెపెరేట్ స్టైల్ తో కమర్షియల్ సినిమా లే కాకుండా కంచె,అంతరిక్షం వంటి ప్రయోగాత్మక చిత్ర ల తో మంచి సక్సెస్ తో పాటు మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.మిస్టర్ ,తొలిప్రేమ ,F2 లాంటి సినిమా లే కాకుండా నెగటివ్ షేడ్ ఉన్న ‘గద్దల కొండ గణేష్’ వంటి సినిమా తో క్రిటిక్స్ నుంచి ప్రసంశలు పొందారు.సినిమా ల తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ మీద కొన్ని రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటాయి..అవి ఏంటి అంటే మెగా ప్రిన్స్ వరుణ్ ,బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripati) ప్రేమ లో ఉన్నారు అని వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని తెగ వార్తలు వచ్చాయి..అయితే ఈ వార్తలని అటు వరుణ్ తేజ్ కానీ లావణ్య త్రిపాఠి కానీ ఖండించలేదు.

2012 లో రిలీజ్ అయినా అందాల రాక్షసి(Andala rakshasi) సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య మొదటి సినిమా తోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు.తర్వాత సోగ్గాడే చిన్ని నాయన ,భలే భలే మగాడివోయ్,శ్రీరస్తు శుభమస్తు సినిమా ల తో మంచి గుర్తింపు లభించింది..ఇక వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమా లో నటించిన సమయం లో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అని ఆ తర్వాత వీరి కలయిక లో వచ్చిన అంతరిక్షము సినిమా తో అది ప్రేమ గా మారింది అంట,ఇక ఇదే విషయం ని కంఫర్మ్ చేస్తూ వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక పెళ్లి సమయం లో లావణ్య ఉదయపూర్ కి వెళ్లి అక్కడ వరుణ్ తేజ్ తో కలిసి ఉన్న ఫొటోస్ వీరి ప్రేమ ని కంఫర్మ్ చేశాయని చెప్పాలి.

ఇక ఇదే విషయం ని కొన్ని ఇంటర్వ్యూ ల లో వరుణ్ తేజ్ గారి తండ్రి నాగబాబు(Naga babu) గారిని అడగక వరుణ్ బాబు కి నచ్చిన అమ్మాయితోనే తన పెళ్లి జరుగుతుంది అని అది ఇండస్ట్రీ వారు అయినా లేక బయట వారు అయినా తన ఇష్టం ప్రకారమే చేస్తాం అని చెప్పడం తో లావణ్య ,వరుణ్ ల పెళ్లి కి లైన్ క్లియర్ అయింది అంటున్నారు..ఇక అన్ని బాగుంటే జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ ఉండబోతుంది అని వీరి సన్నిహితుల నుంచి వస్తున్న వార్త.ఇక ఇప్పటికే వరుణ్ సోదరి అయినా నిహారిక తన భర్త నుంచి దూరంగా ఉంటుంది అని వీరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్న సమయం లో వరుణ్ తేజ్ పెళ్లి న్యూస్ వైరల్ గా మారింది.

1077 views