Varun Tej : వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఫస్ట్ సినిమా ఏదో మీకు తెలుసా?

Posted by RR writings, February 26, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Varun Tej : టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి… ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. మార్చి 1న రిలీజ్ కి రెడీగా ఉంది. రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే షోలో వరుణ్ తేజ్ మొదటి సినిమా గురించి ఇప్పటికీ చాలామందికి తెలియని సీక్రెట్ ను అందరికి తెలియజేశారు.. వరుణ్ హీరోగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడని తెలిసింది. ఆ గెస్ట్ అప్పియరెన్స్‌లో చిరంజీవితో పాటు వరుణ్ తేజ్ కూడా కనిపించారు. అప్పట్లో వరుణ్‌ వయసు పదేళ్లు.. ఆ సినిమా ఏంటంటే.. ‘హ్యాండ్సప్’ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీ. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీనియర్ నటి జయసుధ కథ అందించారు.

సినిమాకు కథ అందించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి ఓ ఫైట్ సీన్‌లో సోనూసూద్‌ని కొట్టిపడేస్తాడు. ఆ సీన్‌లో వరుణ్ తేజ్ ఓ డైలాగ్ చెప్పి వెళ్లిపోతాడు. ఆఫరేషన్ వాలెంటైన్ సినిమా విషయానికొస్తే..తెలుగు, హిందీ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మానుషీ చిల్లర్, రుహాణి శర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం.. తెలుగు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ మూవీగా రాబోతుంది. ఇప్పటివరకు విడుదల అయిన ట్రైలర్, టీజర్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి..

254 views