Varalaxmi Sarathkumar : ఓర్నాయనో.. వరలక్ష్మీ శరత్ కుమార్ మామూలోడిని పట్టలేదుగా

Posted by RR writings, March 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Varalaxmi Sarathkumar : ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో పాజిటివ్, నెగిటివ్ పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె నటనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఇన్నాళ్లు ఆమె పెళ్లి చేసుకోకుండా కెరీర్ కొనసాగిస్తోంది. ఎట్టకేలకు తన అభిమానులకు శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ఒంటరిగా ఉన్న ఆమె పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈరోజు ఏకంగా తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ మొదట తమిళ సినిమాల్లో నటించి ఇప్పుడు తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా స్టార్ నటిగా ఎదిగి పలు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమెకు ముంబైకి చెందిన వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఈ నిశ్చితార్థం ఈరోజు కాదు నిన్న జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వరలక్ష్మికి కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నాడు.

వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. ఇప్పుడు ఉంగరాలు మార్చుకుని తల్లిదండ్రుల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ లేదు, వీలైనంత త్వరగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి వరలక్ష్మి శరత్‌కుమార్ గతంలో హీరో విశాల్‌తో ప్రేమలో ఉన్నారని తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే విశాల్‌తో పాటు వర లక్ష్మి కూడా తాము మంచి స్నేహితులమని, ఒకరంటే ఒకరికి ఎలాంటి చెడు భావాలు లేవని చాలా సార్లు స్పష్టం చేసింది. ఇక తెలుగులో ఆమె చేసిన సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జాకి సోదరిగా అంజమ్మ పాత్రను పోషించింది. యాదృచ్ఛికంగా ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న రోజునే ఆమె నిశ్చితార్థం జరిగింది.

500 views