Vaishnav Tej: పవర్ ఫుల్ టైటిల్ తో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ! టైటిల్ తెలిస్తే పూనకాలే !

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఉప్పెన సినిమా ద్వారా హీరో గా పరిచయం అయినా మెగాస్టార్ మేన అల్లుడు ‘వైష్ణవ్ తేజ్’ మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు,14 సంవత్సరాల నుంచి రామ్ చరణ్ చిరుత సినిమా మీద ఉన్న డెబ్యూ హీరో హైయెస్ట్ కలెక్షన్ రికార్డు ని ఉప్పెన సినిమా తో బద్దలు కొట్టాడు.అయితే తదుపరి చిత్రాలు అయినా క్రిష్ గారితో చేసిన ‘కొండ పొలం’,’రంగ రంగ వైభవంగా’ సినిమా లు కమర్షియల్ గా హిట్లు కాలేదు .ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున వైష్ణవ్ తేజ్ డెబ్యూ డైరెక్టర్ అయినా శ్రీకాంత్ రెడ్డి తో జత కలిసాడు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్‌పై ఎస్ నాగ వంశీ, ఎస్ సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.

వైష్ణవ్ తేజ్ ఇప్పుడు చేస్తున్న తన నాలుగవ సినిమా కి పవర్ ఫుల్ టైటిల్‌ని పెట్టనున్నారు డిఫరెంట్ కథ ,కథనాల తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మధ్య సినిమా టైటిల్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రాజెక్ట్ ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ PVT04గా సూచించబడింది.అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం సినిమా టైటిల్‌కి ‘ఆదికేశవ’ లేదా ‘ముక్కంటి’ అనే రెండు పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ లుక్ ఘాటుగా, శివుడి ఛాయలతో ఉండటంతో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి అపర్ణా దాస్ వజ్ర కాళేశ్వరి దేవిగా నటిస్తోంది. శ్రీ లీల కథానాయికగా నటిస్తుండగా, జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డడ్లీ మరియు నవీన్ నూలి సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు.

6070 views