Upasana Konidela: సినిమా ఇండస్ట్రీ అంటే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. స్వయంకృషి తో ఎలాంటి అండాదండా లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఎంతో కష్టపడి, హీరో గా నిలదొక్కుకొని మెగాస్టార్ గా ఎదిగి నెంబర్ 1 హీరో గా దాదాపుగా నాలుగు దశాబ్దాలు కొనసాగారు. ఆయన తర్వాత సోదరుడు నాగబాబు కూడా ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.
కానీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. ఇక నాగబాబు తర్వాత వచ్చిన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. చిరంజీవి ని మించి క్రేజ్ ని సాధించి నేడు రాష్ట్ర భవిష్యత్తు అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ అద్భుతమైన టాలెంట్ తో పాన్ వరల్డ్ సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్నారు.
ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి వారు కూడా ఇండస్ట్రీ ని షేక్ చేసే రికార్డ్స్ ని కొట్టారు. ఇలా మెగా ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి వచ్చిన ప్రతీ ఒక్కరు సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అతను మరెవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోదరుడు పాన్ష్ కామినేని. ఇతను అతి త్వరలోనే హీరో గా ఎంట్రీ ఇవ్వనున్నారని ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది. ఇతనికి సంబంధించిన లేటెస్ట్ లుక్స్ కూడా అదిరిపోయాయి. ప్రతిభ ఉందా లేదా అనే సంగతి పక్కన పెడితే హీరో గా ఎదిగేందుకు కావాల్సిన కటౌట్, అందం ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈయన మొదటి సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి. పాన్ష్ కామినేని కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలను మీ కోసం అందిస్తున్నాము చూడండి.