Udaykiran: టాలీవుడ్ కుర్ర హీరో ని పెళ్లాడిన ఉదయ్ కిరణ్ మాజీ భార్య రిషిత..? ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, July 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజి ని సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఒక్క కుర్ర హీరో అప్పట్లో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి, ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని సైతం కొల్లగొట్టిన ఏకైక హీరో గా ఉదయ్ కిరణ్ కి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అలా కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయం లో ఉదయ్ కిరణ్ జీవితం లో చోటు చేసుకున్న కొన్ని అనుకోని సంఘటనలు అతని కెరీర్ ని నాశనం చేసుకునేలా చేసాయి. పెళ్లి తర్వాత ఆయన కెరీర్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టలేకపోవడం, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

చాలా కాలం నుండి ఖాళీగా ఇంట్లో ఉండడం, అవమానాలు పడడం వంటివి భరించలేక ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయం లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వచ్ఛమైన చిరునవ్వుతో ఉండే అతని ముఖాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇక ఉదయ్ కిరణ్ వైవాహిక జీవితం గురించి అందరికీ తెలిసిందే. తొలుత మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తో పెళ్లి ఖరారు అయ్యింది. పెద్ద ఎత్తున నిశ్చితార్ధ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్ళకు విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి కూడా టాలీవుడ్ ప్రముఖుల మధ్యలోనే జరిగింది. పెళ్ళైన కొన్నాళ్ల వరకు వీళ్లిద్దరు ఎంతో సంతోషంగా గడిపారు. వీళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది విషిత వేధింపులు, అవమానాలు తట్టుకోలేకనే ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వినిపించేవి. అయితే వాటిల్లో ఎలాంటి నిజం లేదని ఉదయ్ కిరణ్ సోదరి ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇవ్వడం తో ఈ రూమర్స్ కి చెక్ పడింది.

అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత రిషిత ఏమి చేస్తుంది?, వేరే వ్యక్తిని పెళ్లాడిందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె ఎవరిని పెళ్లి చేసుకోలేదట.ఆ మధ్యకాలం లో ఒక యంగ్ హీరోని రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిందే. కేవలం ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలతో జీవితం గడుపుతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకున్నప్పుడే రిషిత ఒక ప్రముఖ ఎమ్మెన్సీ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఉదయ్ కిరణ్ సినిమాల్లో అవకాశాలు లేని సమయం లో ఆమె సంపాదనతోనే కుటుంబం నడిచేది అట. ఇప్పటికీ కూడా ఆమె అదే ఉద్యోగం చేస్తూ జీవితం గడుపుతుందని తెలుస్తుంది.

Tags :
665 views