“హనీమూన్ ఎప్పుడో కూడా మీరే చెప్పండి!” – స్టార్ హీరోయిన్ త్రిష కౌంటర్‌ అదుర్స్‌!

Posted by venditeravaartha, October 12, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

హీరోయిన్ల పెళ్లి పుకార్లు ఇండియన్ సినీ పరిశ్రమలో సర్వసాధారణం. వయసు పెరిగినా, సినిమా అవకాశాలు తగ్గినా, తోటి హీరోయిన్లకు పెళ్లి అయినా.. ఇలా అనేక సందర్భాల్లో హీరోయిన్ల పెళ్లి గురించి పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ల విషయంలో ఈ వార్తలు వారానికోసారి వస్తుంటాయి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిలో అగ్ర కథానాయిక త్రిష ఒకరు. చాలా ఏళ్లుగా త్రిష పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకుని, ఆ తర్వాత అనూహ్యంగా ‘మేము పెళ్లి చేసుకోవడం లేదు’ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా కొంతమంది నటులతో ఆమె ప్రేమ వ్యవహారాలు వార్తల్లో నిలిచాయి.

తాజాగా, చండీగఢ్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను త్రిష పెళ్లి చేసుకోనుందనే కొత్త పుకారు మొదలైంది. ఈ రూమర్‌పై త్రిష ఇచ్చిన రిప్లై ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

త్రిష వ్యంగ్య కౌంటర్:

ఈ వార్తలపై స్పందిస్తూ త్రిష చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. “నా జీవితాన్ని నా కోసం ప్లాన్ చేస్తున్న వాళ్లను నేను ప్రేమిస్తున్నాను. మరెందుకు ఆలస్యం, పనిలో పనిగా నా హనీమూన్ షెడ్యూల్‌ కూడా చెబుతారేమో అని ఎదురుచూస్తున్నా” అంటూ కామెంట్ చేసింది.

ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె తాను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పకనే చెప్పింది. త్రిష సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది ఆమె ‘ఐడెంటిటీ’, ‘విదాయుమురిచ్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘థగ్‌లైఫ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో సూర్య ‘కరుప్పు’, చిరంజీవి ‘విశ్వంభర’ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.

73 views