Bollywood Star:భర్తతో 14 సార్లు ప్రయత్నించింది..సాధ్యం కాలే.. కానీ ఆ స్టార్ నటుడి పుణ్యామాని..

Posted by venditeravaartha, July 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమాల్లో ఉన్నంత కాలం నటుల జీవితం బాగుంటుంది. ఓ వైపు సంపాదన.. మరోవైపు గుర్తింపు.. కానీ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాక చాలా మంది ఫ్యామిలీ లైఫ్ కు అంకితమవుతారు. ఈక్రమంలో కొందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో అశేష గుర్తింపు పొందిన ఓ నటి రియల్ లైఫ్ కొచ్చేసరికి ఓ విషయంలో అనేక కష్టాలను ఎదుర్కొంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది కూడా. కానీ బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో పుణ్యమాని ఆ కష్టం నుంచి గట్టెక్కింది. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. జీవితంలో ఎవరికైనా ఇలాంటి కష్టాలు రావొద్దని, కష్టసమయంలో తనను ఆదుకున్న ఆ హీరో గురించి పొగుడ్తున్న ఆ నటి ఎవరు? అసలేం జరిగింది.

bigboss

కాశ్మీర షా అంటే తెలియని బాలీవుడ్ ఆడియన్స్ లేరు అని చెప్పొచ్చు. తెలుగు, హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో పలు సినిమాలు చేసింది. అలాగే బిగ్ బాస్ 1, నాచ్ బలియే, వంటి టీవీషోలతో గుర్తింపు పొందింది. అయితే కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో హవా సాగించిన ఈ ముద్దుగుమ్మ 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ ను పెళ్లి చేసుకుంది. అందరిలాగే వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలువ వచ్చాయి. దీంతో వీరిద్దరు విడిపోయారు. ఆ తరువాత 2013ల ప్రముఖ నటుడు కృష్ణ అభిషేక్ ను పెళ్లి చేసుకుంది. కాశ్మీర షా టీవీల్లో నటించినప్పుడు వీరిద్దరికి పరిచయం అయి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.

kashmira

అయతే ఎంత నటి అయినా తల్లితనం కావాలని ఉంటుంంది. అలాగే కాశ్మీర షాకు తాను తల్లి కావాలని కలలు కనేది. దీంతో భర్తతో ఈ విషయాన్ని చెప్పడంతో పిల్లల కోసం ప్రయత్నించారు. అయితే పిల్లలు పుట్టాలని ఈమెు భర్తతో కలిసి 14 సార్లు ప్రయత్నించిందట. అయినా పిల్లలు కాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిందట. ఇక తనకు పిల్లలు పుట్టరేమోనని బాధపడేదట. జీవితంలో తల్లిని అవుతానో, లేదోనని భయపడేది. కానీ ఇంతలో తనకు ఓ స్టార్ హీరో పరిచయం అయ్యాడు.

salman

ఆయనే సల్మాన్ ఖాన్. వీరి బాధ చూడలేక సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడట. అదే సరోగసి. సరోగసి ద్వారా బిడ్డను కలి తల్లితనం తీర్చుకోమని కాశ్మీర్ షా కు సూచించాడట. దీంతో ఆయన సలహాతో ఖాశ్మీర సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కన్నారు. ఇప్పుడు ఈ దంపతులు సంతోషంగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతో మా కుటుంబం ఎంతో హ్యాపీగా ఉందని కాశ్మీర షా పలు సందర్భాల్లో టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పింది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి

1738 views