Tollywood:బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిన ఈ సినిమా లు ఎందుకు ప్లాప్ అయ్యాయి ?

Posted by venditeravaartha, May 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమా నుంచి ఒక్కో స్టార్ వస్తుంటాడు అనేది ఒకప్పటి మాట, అయితే సినిమా లో ఎంత దమ్ము ఉన్నపటికీ కొన్ని సినిమా లు ప్లాప్ అవుతున్నాయి,భారీ తారాగణం,స్టార్ హీరో ,హీరోయిన్ లు ఉన్నపటికీ కూడా కొన్ని సినిమా లు సరిగా ఆడలేదు,అవి రీలీజ్ అయినా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి సినిమా ఎలా ప్లాప్ అయింది అనుకుంటాం,అలాంటి సినిమా లు ఏంటో ఒక సారి చూద్దాం.

జగడం:ఎనర్జిటిక్ స్టార్ రామ్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల కెరీర్ లో వాళ్ళ రెండవ సినిమా జగడం,దేవదాసు సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ ,ఆర్య లాంటి కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సాధించిన సుకుమార్ కలయిక లో 2007 లో వచ్చిన జగడం మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది,అయితే యువత ఫ్యాక్షన్ లో ఉండి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు ,స్టూడెంట్ గ్యాంగ్ లను చాల చక్కగా చూపించారు సుకుమార్,అసలు ఈ సినిమా ఇప్పుడు కానీ రిలీజ్ అయి ఉంటె ఇండస్ట్రీ హిట్ సాధిస్తుంది అనడం లో సందేహమే లేదు.మరి అప్పడు ఎందుకు ప్లాప్ అయిందో తెలియదు.

నేనింతే:రవితేజ ,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే సినిమా సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిస్థుతుల మీద వాస్తవాలను చూపించే సినిమా,సినిమా వాళ్ళ కష్టాలు ,వారి కి ఉండే సమస్యల మీద తీశారు.అవార్డు లు వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు.ఇప్పుడు అయి ఉంటె క్లాసిక్ గా నిలిచిపోయేది.

ఓయ్!: లవర్ బాయ్ సిద్దార్ధ్ ,బేబీ షామిలి కలయిక లో ఆనంద్ రంగ డైరెక్షన్ లో 2009 లో రిలీజ్ అయినా క్లాసిక్ లవ్ స్టోరీ ఓయ్ !,యువన్ శంకర్ రాజా గారు సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మంచి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ లవ్ స్టోరీ అప్పుడు సరిగా ఆడలేదు.ఈ సినిమా ద్వారా సిద్దార్ధ్ మరో బొమ్మరిల్లు లాంటి హిట్ కొడతారు అనుకున్నారు కానీ సరిగా ఆడలేదు.

ఖలేజా:సూపర్ స్టార్ మహేష్ ,త్రివిక్రమ్ కలయిక లో అతడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఖలేజా మీద ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి,అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఖలేజా షాక్ ఇచ్చింది.కొత్త కాన్సెప్ట్ జనాలకి ఎక్కలేదు ,దాంతో ప్లాప్ గా నిలిచింది,కానీ టీవీ ల లో ఎప్పుడు వచ్చిన కూడా ఖలేజా కి వచ్చిన రేటింగ్ మరో సినిమా కి రాదు.

ఆరంజ్:టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటి గా చెప్పుకునే సినిమా ‘ఆరంజ్’ ,కేవలం అప్పట్లో రాంచరణ్ కి ఉన్న క్రేజ్ ,భారీ అంచనాలు నడుమ ఒక గొప్ప క్లాసిక్ గా నిలిచినా ఆరంజ్ సినిమా డిసాస్టర్ గా నిలిచింది,ఈ మధ్య రీ రిలీజ్ అయినా ఈ సినిమా రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఊసరవెల్లి:యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ,ఎన్టీఆర్ ని స్టైలిష్ గా చూపించిన సురేందర్ రెడ్డి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ ల వలన సినిమా ప్లాప్ అవ్వాల్సి వచ్చింది,ఇదే సినిమా ఇప్పట్లో అయితే సూపర్ బ్లాక్ బస్టర్ కొడుతోంది అనడం లో సందేహం లేదు.

నేనొక్కడినే:సూపర్ స్టార్ మహేష్ ,సుకుమార్ కలయిక లో వచ్చిన ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయింది అనేది ఇప్పటికి అంతుపట్టని ప్రశ్న,హాలీవుడ్ స్థాయి స్టోరీ ,స్క్రీన్ ప్లే మన వాళ్ళకి అర్ధం కాకపోవడం వలెనే ప్లాప్ అయింది తప్ప సినిమా ఎప్పటికి క్లాసిక్.

618 views