Kajal agarwal: కాజల్ ని రిజెక్ట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో లు! కారణం అదేనా?

Posted by venditeravaartha, July 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు లో కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ,క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి చందమామ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు,ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా ల ద్వారా హీరోయిన్ గా మంచి అవకాశాలే వచ్చినప్పటికి రాజమౌళి గారి మగధీర సినిమా తో స్టార్ హీరోయిన్ స్థాయి కి వెళ్లారు కాజల్(Kajal).రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్ ,ఎన్టీఆర్ ,రామ్ ,మహేష్ బాబు ,విజయ్ ,సూర్య మొదలగు స్టార్ హీరో ల తో నటించిన కాజల్ అగర్వాల్ తెలుగు తో పాటు తమిళ్ ,హిందీ ల లో కూడా బ్లాక్ బస్టర్ సినిమా లో కనిపించారు.

chandamama

మెగాస్టార్ చిరంజీవి గారి రీ ఎంట్రీ మూవీ అయినా ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి గారి పక్కన నటించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు.తన పెళ్లి తర్వాత మంచు విష్ణు తో కలిసి చేసిన మోసగాళ్లు డిజాస్టర్ గా మిగిలింది.చిరు ,కొరటాల శివ ఆచార్య లో హీరోయిన్ గా మొదట అనుకున్నపటికి తాను ఉన్న సీన్ ల ను తొలిగించారు..ఇక ఈ సినిమా తర్వాత తెలుగు లో కాజల్ అగర్వాల్ కనిపించింది లేదు.బాలకృష్ణ గారి NBK108 లో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ కి ప్రస్తుతం తెలుగు లో మరో సినిమా లేదు.

khaidhi

38 సంవత్సరాల కాజల్ కి ప్రస్తుతం తెలుగు లో యంగ్ హీరోల సరసన అవకాశాలు దొరకడం లేదు అయితే ఇండస్ట్రీ లో సీనియర్ హీరో లు అయినా చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున ఇంకా రవితేజ లాంటి వారికి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నపటికీ కూడా ఈమెని వద్దు అని రిజెక్ట్ చేస్తున్నారు.

nagarjuna

దానికి కారణం కాజల్ ఈ మధ్యనే ఒక కొడుకుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే దానికి తోడు ప్రస్తుతం కాజల్ యొక్క అందం కూడా తగ్గింది ,పేస్ లో కూడా కల కూడా లేనట్టు ఉన్నారు కాజల్.దానికి తోడు గత 5 సంవత్సరాల లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు.అయితే ప్రస్తుతం బాలకృష్ణ గారి భగవత్ కేసరి లో నటిస్తున్న కాజల్ కి ఈ సినిమా తో అయినా మంచి అవకాశాలు వస్తాయి ఏమో చూడాలి.

nbk

2094 views