Jayasudha : ‘రికార్డ్ బ్రేక్’ చేసిన సీనియర్ నటి జయసుధ కొడుకు

Posted by RR writings, February 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Jayasudha : తెలుగులో కథానాయికగా జయసుధ ఒక వెలుగు వెలిగారు. టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో స‌హ‌జ న‌టి అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు జ‌య‌సుధ‌. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌ల‌తో పాటు త‌ర్వాత త‌రం హీరోల్లో చిరంజీవి, మోహ‌న్ బాబు వంటి వారితోనూ ఆమె హీరోయిన్‌గా న‌టించింది. త‌ర్వాత ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారింది. త‌ల్లి, వ‌దిన‌, అమ్మ‌మ్మ‌, నాన్న‌మ్మ పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మ‌ధ్య కొంత కాలంగా ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు.

దాదాపు ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో సహజ నటిగా కనిపిస్తూ వస్తున్నారు జయసుధ. చిన్నప్పుడే స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా మెప్పించారు. హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ ఆమె కొడుకు నిహార్ కనీసం నటుడిగా కూడా నిలబడలేకపోతున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం హీరోగా తెరంగేట్రం చేసిన నిహార్ ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.

జయసుధ తనయుడు నిహార్ ఎనిమిదేళ్ల క్రితం బస్తీ అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. 2015లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. అసలు ఈ సినిమా వచ్చిందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో ఐదేళ్ల గ్యాప్ ఇచ్చిన నిహార్ రూట్ మార్చి విలన్ గా ట్రై చేశాడు. రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాలో విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా మిగిలిపోయింది. దీంతో నిహార్ మళ్లీ మొదటికి వచ్చాడు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తెలుగులో రూపొందిన ఈ చిత్రాన్ని మరో 8 భాషల్లోకి అనువదించి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. మార్చి 8న సినిమా విడుదల కానుంది.

406 views