TOLLYWOOD:ఈ వారం టాలీవుడ్ నుంచి రాబోతున్నా సినిమా లు ! మీరు ఏ సినిమా చూడాలి అనుకుంటున్నారు!

Posted by venditeravaartha, May 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఏప్రిల్ నెల లో కేవలం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తో సరిపెట్టుకుంది,యువ హీరో అయినా కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ ,మాస్ మహారాజ్ రవితేజ ‘రావణాసుర’,సమంత ప్రధాన పాత్రా లో నటించిన ‘శాకుంతలం’,సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ ,అక్కినేని అఖిల్ ,సురేందర్ రెడ్డి ల ‘ఏజెంట్’ సినిమా లు డైరెక్ట్ తెలుగు భాష సినిమా లు గా ఏప్రిల్ లో రిలీజ్ కాగా ఇందులో సాయి తేజ్ ‘విరూపాక్ష’ మాత్రమే సూపర్ బ్లాక్ బస్టర్ సాధించింది,ఏప్రిల్ 28 నా ఏజెంట్ తో రిలీజ్ అయినా మణిరత్నం పాన్ ఇండియన్ మూవీ ‘PS2 ‘ తెలుగు లో అంత అంత మాత్రమే ఆడుతున్నప్పటికీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయింది.అయితే ప్రతి వీకెండ్ కి జాతకాలు మారిపోయే ఈ ఇండస్ట్రీ లో ఈ వీకెండ్ ఇలా ఉండబోతుందో చూద్దాం.

మే 5 నా టాలీవుడ్ నుంచి 2 స్ట్రెయిట్ సినిమా లు రిలీజ్ అవుతుండగా మరో రెండు సినిమా లు అదే రోజున రిలీజ్ అవుతున్నాయి,అందులో అల్లరి నరేష్ నటించిన ‘ఉగ్రం’ ,మాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘రామబాణం’.ఆదా శర్మ ప్రధాన పాత్ర లో నటిస్తున్న కేరళ చిత్రం ‘ది కేరళ స్టోరీ’.

అల్లరి నరేష్ కామెడీ చిత్రాలను పక్కన పెట్టి సీరియస్ యాక్షన్,డ్రామా లు చేయడం మొదలు పెట్టిన తర్వాత తీసిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ గాను అటు నటుడి గాను సూపర్ సక్సెస్ ని ఇచ్చింది,ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో యాక్షన్ సినిమా ని తెరెక్కేస్తున్నారు అదే ‘ఉగ్రం’ ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ట్రైలర్ మంచిగా ఆకట్టుకుంది,అల్లరి నరేష్ కి మరో హిట్ పడేటట్లు ఉంది ఈ శుక్రవారం.ఇక లక్ష్యం,లౌక్యం వంటి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో మరో బ్లాక్ బస్టర్ కి రెడీ అయ్యారు.

ఇక ‘హార్ట్ ఎటాక్’ సినిమా తో తెలుగు కి పరిచయం అయినా హీరోయిన్ ‘ఆదా శర్మ’ ప్రధాన పాత్రా లో కనిపిస్తున్నా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ ఇది ఇంతకు ముందెన్నడూ చెప్పని నిజమైన కథ – భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రమాదకరమైన కుట్రను బహిర్గతం చేస్తుంది. కేరళ స్టోరీ కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల నిజమైన కథల సంకలనం.మరి ఈ శుక్రవారం ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అనేది వేచి చూడాలి.

629 views