Tollywood:టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ లు అందరితో సినిమా లు చేసిన కూడా ఒక్క ఇండస్ట్రీ హిట్ సాధించలేని ఆ హీరో ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, May 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరో ల గా ఉన్న ప్రభాస్ ,పవన్ కళ్యాణ్ ,జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ల లో ఇండస్ట్రీ హిట్ కలిగి ఉన్న వారు పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ,ప్రభాస్. 2001 లో రిలీజ్ అయినా ఖుషి సినిమా తో ఇండస్ట్రీ హిట్ సాధించారు పవన్ కళ్యాణ్ ,2006 లో రిలీజ్ అయినా పోకిరి సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మహేష్ బాబు 2015 ,2017 ల లో రిలీజ్ అయినా బాహుబలి సిరీస్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించారు ప్రభాస్.అయితే ఈ సినిమా ల కి డైరెక్టర్ లు ఎస్ జె సూర్య, ,పూరీజగన్నాధ్,రాజమౌళి. ఈ డైరెక్టర్ ల లో ఎస్ ఎస్ రాజమోళి గారికి సెపరేట్ స్టైల్ ,మగధీర ,బాహుబలి ల తో రెండు ఇండస్ట్రీ హిట్ లు కొట్టిన డైరెక్టర్ గా రికార్డు ల లో ఉన్నాడు.

కొంత మంది అన్నట్లు పెద్ద డైరెక్టర్ ల తో సినిమా లు తీస్తే అవి బ్లాక్ బస్టర్ లు సాధించడమే కాకుండా రికార్డు ల ను బ్రేక్ చేస్తాయి అనడం తప్పు అని ఒక హీరో మనకి చెప్పకనే చెప్పారు. ప్రస్తుత కాలం తో టాప్ డైరెక్టర్ లు అయినా రాజమౌళి ,వి వి వినాయక్ ,పూరి జగన్నాధ్ ,కొరటాల శివ,సుకుమార్,శ్రీను వైట్ల ,త్రివిక్రమ్ శ్రీనివాస్ ,బోయపాటి శీను లాంటి వారితో పని చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా రాలేదు,ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సింహాద్రి సినిమా ని ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్న అది ఇండస్ట్రీ హిట్ కాదు అనేది అందరికి తెలిసిన నిజం.రాజమౌళి గారితో 4 సినిమా లు మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ,సింహాద్రి,యమదొంగ ,ఆర్ ఆర్ ఆర్ లాంటి సూపర్ హిట్లు వచ్చినా అవి తన స్టార్ డాం కి ఉపయోగపడ్డాయి కానీ ఇండస్ట్రీ హిట్ లు గా నిలవలేదు.

ఇప్పుడు ఉన్న పరిస్థుతుల తో ఇండస్ట్రీ హిట్ సాధించడం చాల కష్టమైన పని ,ఎందుకు అంటే భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ ,ఇండియన్ లో బెస్ట్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి గారు తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నే బాహుబలి 2 రికార్డు ల ని క్రాస్ చేయలేకపోయింది.మరి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ సాధించాలి అంటే బాహుబలి 2 ని క్రాస్ చేయాలి ,అది ఇప్పట్లో జరిగే పని అయితే కాదు అని కొందరి అభిప్రాయం.

1171 views