Sharwanand: ఎంతమంది దగ్గరికో వెళ్లి లాస్ట్ శర్వానంద్ చెంతకు చేరిన కథ.. ఈ సారైనా హిట్ పడేనా ?

Posted by venditeravaartha, October 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ పరంగా డీలా పడిపోయాడు. శర్వానంద్ ఇటీవల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ‘మహానుభావుడు’, ‘శతమానంభవతి’ సినిమాల తర్వాత ఇప్పటి వరకు ఆయన ఆ రేంజ్ సక్సెస్‌ అందుకోలేకపోయాడు. ఈ సినిమాల తర్వాత తాను నటించిన ‘పడి పడి లేచె మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘మహాసముద్రం’, ‘శ్రీకరం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాలు శర్వానంద్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతేడాది శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ కాస్త ఫర్వా లేదనిపించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్ బ్యాక్ అవ్వాలని గట్టి ప్రయత్నంలో ఉన్నాడు శర్వానంద్. కొంత లేట్ అయినా ఫర్ పెక్ట్ కథను ఎంచుకునేందుకు జాగ్రత్త తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత మరో హిట్ సినిమా దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు కష్టాల్లో కూరుకుపోయిన హీరో శ్రీవిష్ణుకి ‘సామాజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్‌ అందించిన రామ్‌ అబ్బరాజు. ఇటీవల ఆ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీవిష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ ఈ సినిమా. సుమారు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.

ఈ సినిమా సక్సెస్ కావడంతో దర్శకుడు రామ్ అబ్బరాజుకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ అబ్బరాజు తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్ తో చేయబోతున్నాడు. నిజానికి ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అక్కినేని నాగ చైతన్యతో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ఇప్పుడు కథ శర్వానంద్ వద్దకు వెళ్లిందని అంటున్నారు. ‘సామజవరగమన’ విజయంతో మంచి జోరుమీదున్న రామ్ అబ్బరాజుకి శర్వానంద్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను తర్వలో ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఫ్లాపులతో ఉన్న శ్రీవిష్ణుకి భారీ హిట్ అందించిన రామ్ అబ్బరాజు వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

Tags :
620 views