Ntr: స్టార్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ పంపిన గిఫ్ట్ ఎంటో తెలిస్తే షాక్ అవుతారు..

Posted by venditeravaartha, June 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) అంటే యూత్ లో యమ క్రేజీ. పవర్ ఫుల్ యాక్టింగ్ తో అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించే తారక్ రేంజ్ ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీతో వరల్డ్ వైడ్ కు వెళ్లింది. ఈ సందర్భంగా తారక్ నటనపై హాలీవుడ్ నటులు ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తారక్ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ పంపిన గిఫ్ట్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ కూడా పంపని ఆ బహుమతిని చూసి తారక్ గురించి కొనియాడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం గిప్ట్ పంపాడో తెలుసా?

ntr

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే నటించడం కాదు.. పర్సనల్ విషయాల్లోనూ అప్పుడప్పుుడు వినూత్నంగా ప్రవర్తిస్తుంటారు. ఇక ఫుడ్ విషయంలో ఎన్టీఆర్ పకడ్బందీగా ఉంటారనే విషయం ఇప్పటికే చాలా మందికి తెలుసు. బేసిగ్గా నాన్ వెజ్ ప్రియుడు అయిన తారక్ కు రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. కరోనా సమయంలో ఆయన సొంతంగా చికెన్ బిర్యాని వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఆయన కంటెస్టెంట్లకు మటన్ బిర్యాని వండి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

prasanth neel

తాజాగా ఈ హీరో ఓ స్టార్ డైరెక్టర్ కు నాటు కోడి పులుసు పంపాడు. ఆయన ఎవరో కాదు.. ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాల ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్(Prasanth neel) ప్రస్తుతం ‘సలార్’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తరువాత ప్రశాంత్ నీల్ తరువాత సినిమా ఎన్టీఆర్ తో చేయనున్నారు. ఆ మూవీకి సంబంధించిన డిటేయిల్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ ఊరమాస్ లెవల్లో కనిపించే అవకాశం ఉంది.

salar movie

ఈ తరుణంలో ప్రశాంత్ నీల్ బర్త్ డే ఇటీవల వచ్చింది. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువరు హీరోలు, డైరెక్టర్లు సోషల్ మీడియాలో విషేష్ చెప్పారు. కానీ ఎన్టీఆర్ ఏకంగా నాటుకోడి పులుసు ప్రశాంత్ ఇంటికి పంపించాడు. ఇది పంపి బర్త్ డే శుభాకాంక్షలు అని పేర్కొన్నాడు. తారక్ ఇలా నాటుకోడి పులుసు పంపడంపై అంతా షాక్ అయ్యారు. బర్త్ డే గిప్ట్ లు ఇలాక్కూడా పంపుతారా? అని ఆశ్యశ్యపోతున్నారు.

795 views