Actress: ఒంటరిగా వెళ్లనందుకు ఆ నిర్మాతకు కొపం వచ్చింది.. స్టార్ నటి సెన్సేషనల్ కామెంట్స్..

Posted by venditeravaartha, May 31, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. కొంతమంది హీరోయిన్లు, ఇండస్ట్రీకి చెందినవారు తమను కొందరు వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సమస్య ఇప్పుడే కాదు దశాబ్దాల నుంచి ఉందని మరికొందరు సీనియర్ యాక్టర్లు సైతం తమ పేర్లు చెప్పకుండా అసలు విషయాలను బయటపెట్టారు. అయితే ఈ మధ్యకాలంలో పలువురు హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. నిర్మాతలు డైరెక్టర్లు హీరోల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని వారిపై పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ నటి తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. ఈమెను ఓ నిర్మాత వేధింపులకు గురి చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

subh mangal

‘శుభ్ మంగల్ మే దంగల్’ అనే సినిమాలో నటించిన సంగీతా ఒడ్వాని ని ఎవరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగీత ఒడ్వాని సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో ఇండస్ట్రీ కల్చర్ గురించి తెలియదట. దీంతో ఆమె అందరితో సరదాగా ఉండేదాన్ని అని చెబుతూ వచ్చింది. కొన్నాళ్ల తర్వాత పైకి మంచి వ్యక్తి లా కనిపించే ఓ స్టార్ నిర్మాత తనతో మిస్ బిహేవ్ చేశాడట చెప్పింది. ఓ రోజు ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే తనను ఒంటరిగా మాత్రమే రావాలని పదేపదే చెప్పడంతో అనుమానం వచ్చింది.

odvani

దీంతో తాను ఒంటరిగా వెళ్లకుండా స్నేహితులను తీసుకొని వెళ్లానని తెలిపింది. అయితే తాను స్నేహితులతో వెళ్లడంతో ఆ నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సంగీతా చెప్పుకొచ్చింది. దీంతో చేసేదేమీ లేక అర్జెంటుగా వేరే పని ఉందంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడట. ఆ తర్వాత కూడా తనని ఒంటరిగా కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడాని సంగీత చెప్పుకు వచ్చింది. ఈ పరిస్థితి చూసిన ఆమె సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఉంటారని అస్సలు ఊహించలేదని తెలిపింది.

bojpuri actress

ఆ మధ్య కొందరు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే వారు ఏదో ఆరోపణలు చేస్తున్నారు అని అనుకున్నానని, కానీ నేను నేరుగా ఎదుర్కోవడం చూసి పరిశ్రమలో ఇలా ఉంటుందా? అని భయం వేస్తుందని సంగీత తెలుపుతుంది. అయితే సంగీత ఒడ్వాని లాంటి మరెందరో హీరోయిన్లు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె అంటోంది. మరి ఈమెలాగా ఎంతమంది ఇలాంటి ఆరోపణలతో బయటకు వస్తారో చూడాలి..

516 views