THE KERALA STORY:మరో కాశ్మీర్ ఫైల్స్ కానున్న ‘ది కేరళ స్టోరీ’ మూవీ ! రికార్డు స్థాయి లో కలెక్షన్ లు !

Posted by venditeravaartha, May 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈ మధ్య రిలీజ్ అయినా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఆ సినిమా ని స్ఫూర్తిగా తీసుకుని కేరళ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ని సినిమా గా తీస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ని ఆపేయాలి అని చాల దగ్గరలా వ్యతరేక నినాదాలు వచ్చాయి,అయితే సినిమా చూసాక మీకు అభ్యరంతరాలు ఉంటె ఆపేస్తాము అని సినిమా యూనిట్ తెలియచేసారు.ఎన్నో వివాదాల నడుమ మే 5 నా రిలీజ్ అయినా ఈ సినిమా కొన్ని ఏరియా ల లో సినిమా ప్రదర్శనలను ఆపేసారు.ఈ సినిమా గురించి సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోడీ’ సైతం మాట్లాడటం ,కర్ణాటక ఎలక్షన్ ల లో ప్రస్తావించడం దానికి కౌంటర్ గా ప్రతి పక్ష పార్టీలు మాట్లాడటం రాజకీయ రంగులు ఈ సినిమా కి కలిసాయి.

2008 లో రిలీజ్ అయినా 1920 సినిమా ద్వారా హిందీ సినిమా ల లోకి వచ్చిన అదా శర్మ మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ,2014 లో నితిన్ ‘హార్ట్ అటాక్’ సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చి క్షణం,son ఆఫ్ సత్యమూర్తి,కల్కి లాంటి సినిమా ల లో నటించింది.
అయితే ఎన్నో వివాదాల కి కారణం అయినా లవ్ జిహాద్ నినాదం తో తీయబడిన ది కేరళ స్టోరీ లో మెయిన్ లీడ్ లో కనిపించిన ఈమె ఎన్నో బెదిరింపు కాల్స్ ని అందుకుంది ఈ సినిమా చేయొద్దు అని కానీ స్టోరీ నచ్చడం తో సినిమా లో నటించాను అని చెప్పారు,
తమిళనాడులో రెండో రోజు షోస్‌ క్యాన్సిల్‌ను కూడా రద్దు చేశారు. మరి రాజకీయ మంటల్లో నలుగుతోన్న ఆదాశర్మ ది కేరళ స్టోరీ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది? కలెక్షన్లు ఎలా సాధిస్తుందో,మరో కాశ్మీర్ ఫైల్స్ కానుందా అనేది చూద్దాం !

రిలీజ్ అయినా మొదటి రోజు ‘ది కేరళ స్టోరీ ‘ బాక్సాఫీసు వద్ద 8 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. టాక్ మంచిగా ఉండటం వివాదాలు ఉండటం తో రెండో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి. శనివారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు వసూలు చేసింది. ఇక ఆదివారం రోజు అయితే మొదటి రెండు రోజులకి మించి 15 కోట్లు వసూలు చేసింది. మొత్తమ్మీద మూడు రోజుల్లో రూ. 35 కోట్లను కలెక్ట్‌ చేసింది . ది కేరళ స్టోరీ’ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఎన్ని వివాదాలు వచ్చిన రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతున్న కూడా రోజు రోజు కి పెరుగుతున్న కలెక్షన్ ల ని చూసి ఈ సినిమా అన్ని ఏరియా లో రిలీజ్ అయ్యి రన్ అయితే కచ్చితంగా కాశ్మిర్ ఫైల్స్ సాధించిన రికార్డు ల ని అందుకుంటుంది అనడం లో సందేహం లేదు.

1963 views