Michaung Cyclone మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి – బొడ్డు

Posted by venditeravaartha, December 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Michaung Cyclone: సీతానగరం మండలం కూనవరం,ముగ్గళ్ల గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి మిచౌంగ్ తుఫాన్ కారణంగా రాజానగరం నియోజకవర్గం లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

అధికారులు క్షేత్ర స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా వేయాలి ముందస్తు తక్షణ సాయం కింద ఇవ్వాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లను సందర్శించి దేబ్భతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందించాలి. పంట నష్ట అంచనాలో జాప్యం లేకుండా పారదర్శకంగా అధికారులు వ్యవహరించి, ప్రతి రైతుకు అండగా నిలవాలని అయన కోరారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంటనే భీమా చేసి రైతులను కాపాడాంలని ఆయన తెలిపారు ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని బొడ్డు వెంకటరమణ చౌదరి డిమాండ్ చేసారు.

Tags :
236 views