ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ గా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్.వారాహి యాత్ర లో తాను ఆంధ్ర ప్రదేశ్ లోని వాలంటీర్ ల వ్యవస్థ ,డేటా చోరీ,డేటా ప్రైవసీ గురించి చేసిన వ్యాఖ్యలు పైన మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద పరువు నష్టం కేసు పెట్టాలని పోలీస్ శాఖ ని ఇన్విస్టిగేషన్ చేయమని ఆదేశించారు.2014 లో జనసేన పార్టీ ని స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు 2014 లో టీడీపీ ,బీజేపీ లకి సపోర్ట్ చేసి 2019 లో సిపిఐ ,సిపిఎం ,బి ఎస్పీ ల తో కలిసి వెళ్లారు..
వారాహి విజయ యాత్ర లో భాగంగా ఏలూరు సభ లో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ గారు డేటా చోరీ ,డేటా ప్రైవసీ అనేది చాల ముఖ్యమైన విషయం అని ,కానీ ప్రస్తుతం ఉన్న వాలంటీర్ ల తో ప్రజల డేటా ని సేకరించి ఆ డేటా ని హైదరాబాద్ లో ఉన్న FOA కంపెనీ కి ఇవ్వడానికి గల కారణం ఏంటో చెప్పాలి అని అడిగారు.ప్రతి ఇంట్లో కి వెళ్లి వారి పర్సనల్ డేటా ని వాలంటీర్ లు అడిగి తెలుసుకుని కొంత మందికి తెలియచేస్తున్నారు అని దాని వలన కొంత క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలియచేసారు.అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉన్నపటికీ
దానిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రివర్స్ లో ఆయన మీదే కేసు లు పెట్టాలని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.
విశాఖ జిల్లా వైస్సార్సీపీ నుంచి పంచకర్ల రమేష్ బాబు జులై 20 న పవన్ కళ్యాణ్ గారి సమక్షం లో జనసేన లో చేరిన విషయం తెలిసిందే.ఇక అంతకముందే ఢిల్లీ లో బీజేపీ ఏర్పాటు చేసిన NDA సమావేశానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రధాని మోడీ ,అమిత్ షా ల తో భేటీ అయ్యి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన డేటా చోరీ గురించి ,2024 ఎన్నికల గురించి మాట్లాడారు.ఇక ఆయన తిరిగి విజయవాడ వచ్చే సరికి ప్రభుత్వం ఆయన ని అరెస్ట్ చేయాలి ఆర్డర్ ఇచ్చారు.
జులై 27 నుంచి వారాహి విజయ యాత్ర మూడవ ఫేస్ స్టార్ట్ కానున్న సమయం లో పవన్ ని అరెస్ట్ చేయాలి అని జగన్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.జనసేన అధినేత ని అరెస్ట్ చేయాలి అంటే ఆయన చేసిన తప్పు ఏంటి అనేది నిర్ధారణ అవ్వాలి,ఒక వేళా అలా కాకుండా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు లో ఉంచాలి అని పోలీస్ శాఖ అనుకుంటున్నారు.