RRR Oscar-Award :’నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడానికి ముఖ్య కారణం అదే నా ???

Posted by venditeravaartha, March 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆస్కార్, ఆస్కార్ ఎట్టకేలకు మన ఇండియన్ సినీ చరిత్ర లో మొదటి సారిగా ఇండియన్ సినిమా కి ఆస్కార్ అవార్డు లభించింది , అదేంటి మనకి ఇది వరకే ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కదా ,ఇదే మొదటి సారి అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా ,నిజమే మన ఇండియా కి మొదటి సారిగా ‘గాంధీ ‘ అనే హాలీవుడ్ మూవీ కి కాస్ట్యూమ్ డిజైన్ కి పని చేసిన మన ఇండియన్ అయినా ‘భాను అత్తయ్యా’ కి వచ్చింది.
తర్వాత ‘సత్యజిత్ రాయ్’ గారికి వచ్చిన అది అయన సినిమా ఇండస్ట్రీ కి చేసిన విశిష్ట సేవలకు గాను వచ్చింది. 2009 లో AR రెహ్మాన్ గారికి ‘స్లండాగ్ మిల్లీనియర్స్ ‘ కి లభించింది. ఈ అవార్డ్స్ ల లో 2 హాలీవుడ్ మూవీస్ కి ,ఒకటి పర్సనల్ గా వచ్చినవి కానీ మన ఇండియన్ సినిమా కి రాలేదు. 95 వ అకాడమీ అవార్డ్స్ ల లో మన తెలుగు సినిమా అయినా ‘RRR ‘ కి ‘నాటు నాటు ‘ పాట కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ఆస్కార్ అవార్డు రావడం అందరికి తెలిసిన విషయం,ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ,మీడియా ల లో ఇదే న్యూస్కా,నీ ఒక్క సారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే అసలు ఆస్కార్ అవార్డు కి మన ‘నాటు నాటు ‘ సాంగ్ ఎలా నామినేట్ అయింది ,అవార్డు గెలిచే అంతా సత్తా మన పాట కి ఉందొ లేదో చూద్దాం.

RRR సినిమా లో ఉన్న పాట ల లో బెస్ట్ సాంగ్ ఏది అంటే ప్రతి ఒకరు టక్కున చెప్పే సాంగ్ ‘కొమరం భీముడొ ‘ సాంగ్ .ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి నటన ,రామ్ చరణ్ గారి ఎమోషన్ తో పాటు లిరిక్స్ మరియు సంగీతం అందరిని ఆకట్టుకుంది,కానీ ‘నాటు నాటు’ సాంగ్ ఎందుకు ఆస్కార్ కి నామినేట్ అయింది అంటే దానికి మొదటి కారణం ఆ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ వేసిన స్టెప్స్ , ఈ సాంగ్ కి
కోరియోగ్రఫీ చేసిన ‘ప్రేమ్ రక్షిత్’. RRR సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అన్ని సోషల్ మీడియా ల లో నాటు నాటు సాంగ్ కి ‘రీల్స్’ ల లో మంచి పాపులారిటీ వచ్చింది.ఇండియా లోనే కాకుండా మొత్తం ప్రపంచం అంతా వీపరీతమైన క్రేజ్ ని తెచ్చుకుంది.ఎంత క్రేజ్ ఉన్నపటికీ నాటు నాటు సాంగ్ ని నామినేషన్ లో తీసుకుని వచ్చింది మాత్రం కేవలం ‘రాజమౌళి ‘ గారు.

ఒక సినిమా ని ఎలా ప్రోమోట్ చేయాలో రాజమౌళి గారి కంటే తెలిసిన వాళ్ళు మన భారత దేశ సినీ పరిశ్రమ లో ఎవరు ఉండరు, అలాంటిది అంతా క్రేజ్ ఉన్న నాటు నాటు సాంగ్ కోసం ఇంకెంత చేసి ఉంటారు. ఇక్కడ అందరు నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా గర్వపడుతూ జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ల ని టాగ్ చేస్తూ గ్లోబల్ స్టార్స్ అంటున్నారు ,కాని తాను గ్లోబల్ డైరెక్టర్ అవ్వడానికి రాజమౌళి గారు ఇదంతా చేస్తున్నారు ,చేసారు అని చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు.
దానికి కారణం లేకపోలేదు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అపజయం ఎరుగని డైరెక్టర్ రాజమౌళి గారు ,తాను తీసిన అన్ని సినిమా లు బ్లాక్ బస్టర్ లే , కానీ అన్ని సినిమా లు కూడా కమర్షియల్ గా విజయాలు సాధించినవే , బాహుబలి సినిమా తో ఇండియా అంతటా రాజమౌళి గారి పేరు మారు మోగింది, రాజమోళి గారికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు హీరో ప్రభాస్ కి వచ్చింది ,కానీ ఆ తర్వాత రిలీజ్ అయినా ప్రభాస్ గారి సినిమా లు ఆశించిన విధంగా ఆడలేదు ,కానీ తన తర్వాతి సినిమా అయినా ‘RRR ‘ తో రాజమౌళి మరో సరి తన స్టామినా చూపించారు ,కానీ ఈ సారి ఇండియా మాత్రమే కాకుండా అమెరికా ,జపాన్ ,చైనా మొదలగు దేశ ల లో కూడా సత్తా చాటారు.

RRR కి వచ్చిన రెస్పాన్స్ ని హీరో లు అయినా జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఎలా ఉపయోగించుకుంటారో ఏమో కానీ రాజమౌళి మాత్రం ఈ సారి తన మార్క్ ని హాలీవుడ్ లో కూడా చూపించాలి అనుకుంటున్నారు. దానికి తనకి దొరికిన అస్త్రమే ‘నాటు నాటు ‘ సాంగ్ . కొంత మంది ఆస్కార్ అవార్డు కోసం 50 , 80 కోట్లు ఖర్చు చేసారు అంటున్నారు ,నిజానికి అందులో ఈ మాత్రం కూడా వాస్తవం లేదు ,1000 మందికి పైగా ఉండే ఆస్కార్ కమిటీ దగ్గర కి ఒక నామినేషన్ వెళ్ళాలి అంటే అది డబ్బులు ల తో వెళ్ళేది కాదు , దానికి అంటూ కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి ,అవి అన్ని మీట్ అయితే నే వాళ్ళు నామినేషన్ కి పంపుతారు. అలా అని అసలు డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటారు అని కూడా అనడం లేదు ,ఎంతో కొంత ఖర్చు చేయకుండా అంతా మంది సభ్యులకి సినిమా ని చూపించలేరు కదా. ఏది ఏమైనప్పటికి ‘RRR ‘ సినిమా మన ఇండియా మొత్తానికి గర్వకారణం అనే చెప్పాలి.

Tags :
153 views