Leo Review : విజయ్ ‘లియో’ మూవీ ఫుల్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

Posted by venditeravaartha, October 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Leo Movie: కోట్లాది మంది సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన తమిళ స్టార్ హీరో విజయ్ లియో చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. సరైన బ్లాక్ బస్టర్ కోసం సౌత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సమయం లో ఈ లియో చిత్రం ఎడారి లో ఒయాసిస్ లాగ బయ్యర్స్ కి తగిలింది. ముఖ్యంగా మన టాలీవుడ్ లో రీసెంట్ సమయం లో సరైన హిట్ లేదు. సినిమాలు లేక వెలవెలబోతున్న ఈ సమయం లో విజయ్ ‘లియో’ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్స్ కోసం ప్రత్యేకంగా ఆబ్లిగేషన్స్, ఇలా ఒక పండుగ వాతావరణం ని తలపించింది. అలా కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

కథ విషయానికి వస్తే కాశ్మీర్ ప్రాంతం లో తన పెళ్ళాం పిల్లతో కలిసి ఒక కేఫ్ ని నడుపుకుంటూ సాధారణమైన జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి మీద వరుసగా దాడులు జరగడం మొదలు అవుతాయి. ఎవరు ఎందుకు తమపై దాడి చేస్తున్నారో పాపం హీరో కి అర్థం కాదు, అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ దాడులు తన లాగే అచ్చు గుద్దినట్టు ఉండే ‘లియో’ శత్రువులు చేస్తున్నారని, తనకి అసలు ఏమి సంబంధం లేదని అతను అందరితో అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ ఈ లియో ఎవరు?, అతను గతం లో ఎలాంటి పనులు చేసేవాడు?, ఎందుకు అతనిని ఇంత మంది చంపాలని చూస్తున్నారు. అసలు ఈ లియో అనే వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా ?, ఒక్కడా లేకపోతే ఇద్దరా? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

సినిమా ప్రారంభం పది నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటుంది, బ్లాక్ బస్టర్ హిట్ వైబ్రేషన్స్ ఇక్కడే వచ్చేస్తాయి. కానీ ఆ తర్వాత చిన్న స్లో అవుతూ వెళ్తుంది మూవీ. ఆడియన్స్ కి కాస్త బోర్ అనిపించొచ్చు, కానీ మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ని ఇస్తుంది. కానీ ఓవరాల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆశించిన స్థాయిలో లేదే, ఎక్కడో ఎదో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ కలుగుతాది. కానీ సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ ప్రారంభం అయ్యాక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా సాగుతాది. కొన్ని కొన్ని యాక్షన్ బ్లాక్స్ అద్భుతంగా వచ్చాయి.

ఇక చివరి 30 నిముషాలు అయితే మనం పెట్టుకున్న అంచనాలను మించి అద్భుతంగా నడిచిపోతుంది ఈ చిత్రం. ట్రైలర్ లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని చూసి ఫ్యాన్స్ నిరాశ చెందారు, కానీ సినిమా లో అతను తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. చాలా సన్నివేశాలు ఒక రేంజ్ లో పేలడానికి కారణం అనిరుద్ అనే చెప్పొచ్చు. ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో లోకేష్ గత చిత్రాలకు లింక్స్ ఉన్నాయా లేదా అనేది మేము చెప్పము, అది సినిమా చూసి మీరే తెలుసుకోండి. కచ్చితంగా సినిమాలోని ఈ అంశం మీ అందరినీ థ్రిల్ కి గురి చేస్తుంది.

రేటింగ్ : 3 /5

279 views