తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ మరియు క్యాడర్ మీటింగ్

Posted by venditeravaartha, March 13, 2026
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ మరియు క్యాడర్ మీటింగ్‌లో రూడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను ఆయన శ్రద్ధగా విన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు.
పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రజలతో మరింత దగ్గరగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే రాజానగరం నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags :
98 views