Postal ballot: ఆంధ్ర ప్రదేశ్ లో మరో 9 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మూడు పార్టీల భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముగిసిపోబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ పరిపాలన పై జనాలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయ సర్వేలు సైతం చెప్తున్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభలకు జనాలు ఉప్పెన లాగ తరళి వస్తుంటే, సీఎం జగన్ సభలు మాత్రం జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎన్నికలు జరగకముందే అందరికీ అర్థం అయిపోయింది.
అయితే నేడు పోస్టల్ బాలట్ ఎన్నికలు ప్రారంభం అయ్యింది. ఈ ఎన్నికలలో టీడీపీ – జనసేన పార్టీ సునామి సృష్టించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం దాదాపుగా 5 లక్షల దరఖాస్తులు జరిగాయి. 2019 ఎన్నికలలో కేవలం లక్ష దరఖాస్తులు మాత్రమే జరిగింది. 5 లక్షల ధరకాస్తులలో సుమారుగా 70 శాతంకి పైగా ఓటింగ్ టీడీపీ, జనసేన కి జరిగాయట. అంతే కాకుండా బీజేపీ పార్టీ కూడా పలు స్థానాల్లో సత్తా చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
వైసీపీ పార్టీ కి ఏ స్థాయి ఓటమి రాబోతుందో, ఎన్నికల రోజు జనాలు వైసీపీ మీద ఉన్న కోపాన్ని ఎలా చూపించబోతున్నారు అనేది ఈ పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ఒక ఉదాహరణ అని అంటున్నారు. నిజంగా 70 శాతం కి పైగా ఓటింగ్ టీడీపీ – జనసేన కూటమికి వస్తే, అసెంబ్లీ స్థానాలు 150 కి పైగానే కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఫలితాలు జూన్ 4 న అసెంబ్లీ ఓటింగ్ కౌంటింగ్ కి ముందే వెలువడనున్నాయి. పోస్టల్ బాలట్ ఓటింగ్ లో విజయం సాధించిన పార్టీలకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ కి అదే జరిగింది. చూడాలి మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది.