Tarun-Aarthi agarwal: త్వరలోనే తరుణ్ పెళ్లి ! తరుణ్-ఆర్తి అగర్వాల్ ప్రేమ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణ్ తల్లి రోజా రమణి.

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ హిట్ సినిమా ల లో నటించి ఆ తర్వాత నువ్వే కావాలి(Nuvve kavali) సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చారు తరుణ్(Tarun)..మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తరుణ్ ,ఆ తరువాత కూడా మంచి లవ్ స్టోరీస్ ల తో లవర్ బాయ్ గా మంచి గా పాపులర్ అయ్యారు,సినిమా ల లో పీక్ స్టేజ్ లో ఉన్నపుడే నటి ఆర్తి అగర్వాల్(Aarthi agarwal) తో ప్రేమాయణం ఆ తర్వాత బ్రేక్ అప్ అవ్వడం,సినిమా లు సరిగా ఆడకపోవడం,పలు డ్రగ్ కేసు ల లో తరుణ్ ఉండటం తో కొంచెం కొంచెం గా కెరీర్ గాడి తప్పి సినిమా ల నుంచి దూరంగా ఉంటున్నారు..టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లో ఒకరు, తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ఆయన తల్లి రోజా రమణి(Roja ramani) చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

వరుస సినిమా ల తో బిజీ ఉన్న సమయం లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపిన తరుణ్ ,ఆమె తో పెళ్లి వరకు వెళ్లారు అదే సమయం లోనే తరుణ్ వాళ్ళ అమ్మ రోజా రమణి గారి వలన ఆర్తి అగర్వాల్ ని దూరం పెట్టారు తరుణ్.. అప్పట్లో ఆర్తి అగర్వాల్ తరుణ్ కోసం ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసారు.అయితే 40 సంవత్సరాలు వచ్చిన కూడా ఇంత వరకు పెళ్లి చేసుకుని తరుణ్ సినిమా ల నుంచి కూడా దూరంగా ఉన్నారు.

ఇదే విషయాన్ని ఆయన తల్లి దగ్గర ప్రస్తావించగా తరుణ్ గురించి వస్తున్న వార్తలు విని చాల బాధ వేసింది తాను త్వరలోనే సినిమా ల లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ..ఒక వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్నారు స్వతహాగా తనకి పబ్ బిజినెస్ ఉండటం తో తాను డ్రగ్ వ్యవహారాల లో ఉన్నాడు అని వచ్చిన వార్తల లో నిజం లేదు అని అన్నారు..ఆర్తి ఆగర్వాల్ విషయం లో తన జ్యోక్యం లేదు అని వారి మధ్య వచ్చిన కొన్ని విబేధాల వలన వారు విడిపోయారు అని చెప్పారు..తరుణ్ పెళ్లి చేసుకుంటే చూడాలి అని ఉంది అని అది కూడా త్వరలోనే జరిగుతోంది అని అన్నారు.

2665 views