Tarakaratna: అత్యంత దయనీయమైన పరిస్థితిలో తారకరత్న భార్య..పట్టించుకోని నందమూరి కుటుంబం!

Posted by venditeravaartha, July 6, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Taraka Ratna: ఇటీవల కాలం లో మన అందరినీ ఎంతో బాధకి గురి చేసిన సంఘటన నందమూరి తారకరత్న చనిపోవడం. గత ఏడాది ఫిబ్రవరి నెలలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ సమయం లో ఈ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజకీయ అరంగేట్రం చేసి 2024 ఎన్నికలలో ఎదో ఒక స్థానం నుండి ఎమ్మెల్యే గా పోటీ చెయ్యాలని ఆకాంక్షించాడు తారకరత్న. తెలుగు దేశం పార్టీ తరుపున క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తూ, అన్నీ రకాల పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేవాడు.

2024 ఎన్నికలలో టీడీపీ ఏ స్థాయిలో విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఎన్నడూ లేనటువంటి మెజారిటీలను సొంతం చేసుకొని చరిత్ర తిరగరాసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ తారకరత్న పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచి ఉంటే ఆయన రాజకీయ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. నేడు ఆయన కుటుంబం కూడా ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేది. కానీ తారకరత్న మరణంతో ఆ కుటుంబ పరిస్థితి మొత్తం తారుమారైంది. మొదటి నుండి తారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానించలేదు. చాలా సంవత్సరాల నుండి ఆ కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఒక్క బాలయ్య బాబు తప్ప ఆ కుటుంబం లో ఎవ్వరూ కూడా తారకరత్న ని, అతని భార్య ని దగ్గరకు చేరదీయ్యలేదు. చనిపోయిన తర్వాత అయినా పరిస్థితులు మారుతాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చేసిన చిట్ చాట్ లో అలాంటిదేమో లేదని తెలిసింది.

ఒక అభిమాని అలేఖ్య రెడ్డి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీతో నందమూరి కుటుంబం ఇప్పటికైనా సఖ్యతతో ఉంటుందా?, మిమ్మల్ని దగ్గరకి చేరదీసారా?’ అని అడగగా, దానికి అలేఖ్య రెడ్డి సమాధానం చెప్తూ ‘నమ్మకమే మనిషికి శక్తి ని ఇస్తుంది. ఆ నమ్మకం తోనే నేను, తారక్ ఇన్ని రోజులు జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాము. నేడు నేను కూడా ఆ నమ్మకం తోనే నా ఒంటరి ప్రయాణం ని కొనసాగిస్తున్నాను. ఎదో ఒక రోజు వాళ్ళు నన్ను దగ్గరకి తీసుకుంటారు అని ఆశిస్తున్నాము’ అంటూ అలేఖ్య రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ ని చూసి అభిమానులు అలేఖ్య రెడ్డి పరిస్థితి ని చూసి కంటతడి పెడుతున్నారు. రాయి అయినా కరుగుతుందేమో కానీ, ఈ నందమూరి కుటుంబ సభ్యుల మనస్సు కరగదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

476 views