HHVM: ‘హరి హర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగనున్న తమిళ హీరో విజయ్!

Posted by venditeravaartha, May 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. భారీ బడ్జెట్ తో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని ఎవ్వరూ చూడని గెటప్ లో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి, అలాగే రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మొదటి రోజు యూట్యూబ్ లో టీజర్ కి వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ, రెండవ రోజు మాత్రం ఏకంగా 10 మిలియన్ పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ పూర్తి చెయ్యబోయే సినిమాలలో ఇది ఒకటని, కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని, ఈ ఏడాది డిసెంబర్ 20 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని విడుదల చేయబోతున్నారట.

ఈ చిత్రం హిందీ ప్రీమియర్ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమిత్ షా, నరేంద్ర మోడీ ని స్వాగతించబోతున్నారట. అలాగే తమిళం లో ప్రస్తుత సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న విజయ్ ని తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించబోతున్నారట. పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుండి విపరీతమైన అభిమానం హీరో విజయ్ కి ఉన్నది. అలాగే ఆయనకి హరి హర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం తో కూడా మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇలా ప్లాన్ చేసారని తెలుస్తుంది. అలాగే కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శివ రాజ్ కుమార్ ని, మలయాళం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మోహన్ లాల్ ని ఆహ్వానించబోతున్నారట. ఇలా పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమాని ప్రమోట్ చేయబోతున్నారట టీం.

236 views