Yogi Babu: కమెడియన్ యోగి బాబు భార్య ఈ రేంజ్ లో ఉందేంటి..హీరోయిన్స్ కూడా పనికిరారుగా!

Posted by RR writings, November 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Yogi Babu: కోలీవుడ్(Kollywood) స్టార్ కమెడియన్స్ లో ఒకరైన యోగి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. యోగి బాబు కామెడీ టైమింగ్‌కి తమిళనాడులో చాలా మంది అభిమానులు ఉన్నారు. యోగి బాబుకు స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. యోగి బాబు కొత్త సినిమాలకు డేట్లు కేటాయించడం కూడా కష్టమైపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్టార్ కమెడియన్ మాత్రం ఊహించని స్థాయిలో తన రెమ్యునరేషన్ పెంచాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల స్థాయిలో యోగిబాబు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ కమెడియన్ రోజుకు 18 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ కొరత ఉండటంతో నిర్మాతలు ఈ రేంజ్ లో ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యోగిబాబుకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో యోగి బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరుగుతూనే ఉంది. యోగి బాబు రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు డేట్స్ ఇవ్వడం యోగి బాబుకు కష్టమైపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యోగి బాబు ఇటీవల జవాన్(Jawan), బిచ్చగాడు 2(Bichagadu 2), లవ్ టుడే(Love Today) వంటి సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా సినిమాకి యోగి బాబు రేంజ్ పెరిగిపోతుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలుగులో బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్‌లు విజయం సాధించగా.. తమిళంలో యోగిబాబు కమెడియన్ గా సక్సెస్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా యోగిబాబు మూడేళ్ల క్రితమే ఓ ఇంటి వాడయ్యాడు. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన మంజు భార్గవిని ఆయన ఫిబ్రవరి 5,2020న వివాహం చేసుకున్నారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం తమిళనాడు తిరుతనిలో ఈ వివాహం జరిగింది. కాగా యోగిబాబు తన వివాహం విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచారు. మీడియాకు పొక్కకుండా సన్నిహితుల మధ్య ఈ వివాహాన్ని చేసుకున్నారు. రిసెప్షన్‌ను చాలా గ్రాండ్ గా చెన్నైలో నిర్వహించారు. డిసెంబర్ 28న భార్య మంజు మగబిడ్డకు జన్మనిచ్చింది. మంజును చూసిన నెటిజన్లు హీరోయిన్లను మించిన అందం ఉందంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా యోగిబాబు సో లక్కీ అంటున్నారు.

1601 views