2010 లో రిలీజ్ అయినా ‘ఝుమ్మందినాదం’ సినిమా తో తెలుగు లో అడుగు పెట్టారు ‘తాప్సీ పన్ను’, ఆ తరవాత వరుస సినిమా ల లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా అయిపోయారు,ప్రభాస్ గారి తో మిస్టర్ పర్‌ఫెక్ట్,గోపీచంద్ గారి ‘సాహసం’ సినిమా ల తో తెలుగు మంచి పేరు సంపాదించారు,హిందీ లో ‘పింక్’ సినిమా తో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయి కి వెళ్లారు. తెలుగు లో అప్పుడపుడు కనిపించే తాప్సీ,హిందీ లో వరుస గా సినిమా లు చేస్తున్నారు.
అయితే ఈమె ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యాషన్ షోలో ఆమె తన అందంతో చూపరులను ఆకర్షించింది. ఇప్పుడు ఇదే ఈమె ను ఇబ్బందులో కి నెట్టింది,ఇందుకు ప్రధాన కారణం ఆమె ధరించిన నెక్లెస్. లక్ష్మీ దేవి రూపు ఉన్న బంగారు నెక్‌లెస్‌ను ధరించిన తాప్రీ,ప్యాషన్ షోలో ర్యాంప్‌పై నడిచింది. ఇప్పుడు ఈ నెక్‌లెసే ఆమెను సరికొత్త వివాదంలోకి లాగింది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ తాప్సీపై ముంబయి ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్చి12న ముంబయి వేదికగా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమె శరీరం కనిపించేలా ఎరుపు రంగు గౌను ధరించింది. అంతేకాకుండా అందుకుణంగా ఓ ఖరీదైన బంగారపు నెక్‌లెస్‌ను మెడలో వేసుకుంది. అయితే ఆ నెక్‌లెస్‌పై లక్ష్మీదేవి డిజైన్ ఉండటం వివాదాన్ని రాజేసింది. అసభ్యకరంగా ఉన్న దుస్తులను ధరించి లక్ష్మీదేవి హారాన్ని మెడలో వేసుకోవడం పట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా తాప్సీపై నెటిజన్లు మీమ్స్ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాప్సీ ఇలా చేయడం సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకలవ్య గౌర్.. తాజాగా తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందుమతాన్ని అవమానించేలా ఆమె ప్రవర్తించిందని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆమె మీద పోలీసు కేసు నమోదైనప్పటికీ తాప్సీ ఫొటో ఇప్పటికి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ టైమ్‌లైన్‌లో ఉండటం గమనార్హం.మరో ఆశ్చర్యకమైన విషమేమంటే తాప్సీ ధరించిన లక్ష్మీ దేవి నెక్లెస్ రిలయన్స్ జ్యూవెల్స్ నుంచి వచ్చాయి. ఇది అక్షయ తృతీయ సందర్భంగా సేకరించిన సెలక్షన్. తాప్సీ ఇతర సెలబ్రెటీల మాదిరిగానే దీన్ని ఎండోర్స్ చేసింది. అయితే ఆమె ఆ హారాన్ని ధరించినందుకు ప్రస్తుతం నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.తన మీద ఎన్ని నెగటివ్ ఆరోపణలు చేసినప్పటికీ తాను మాత్రం వీటి గురించి పట్టించుకోకపోవడం నెటిజనుల ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.