SUMAN-YSRCP:ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేని మీరు రజినీకాంత్ ని తిడతారా! వైసీపీ నాయకుల మీద సుమన్ ఘాటైన వ్యాఖ్యలు.

Posted by venditeravaartha, May 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

భారత దేశం లో ఉన్న 5 భాష ల లో టాప్ స్టార్ ల లో ఒకరు అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి ఇండియా లోనే కాకుండా యావత్ ప్రపంచం లోను అభిమానులు ఉన్నారు ,ఆయన సినిమా రిలీజ్ అయితే ప్రైవేట్ కంపెనీ లు సైతం హాలిడే ప్రకటించే రేంజ్ లో ఆయన స్థాయి ఉంది,అలాంటి వ్యక్తి ని ఆంధ్ర ప్రదేశ్ లో ని అధికార పార్టీ నాయకులు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల లో ఎన్టీఆర్ ,చంద్రబాబు గురించి మాట్లాడిన స్పీచ్ కి వైసీపీ వారు అంత సూపర్ స్టార్ మీద వ్యతిరేక నినాదాలు ,తిట్లు తిట్టడం చేస్తున్నారు.వైసీపీ పార్టీ ని కానీ,సీఎం ని ఒక్క మాట అనలేదు,మరి అలాంటప్పుడు రజినీకాంత్ ని ఎందుకు తిట్టారు అని కొంత మంది వైసీపీ వారి మీద వ్యతిరేకం గా మాట్లాడిన సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద గా ఎవరు రెస్పాండ్ కాలేదు.సీనియర్ నటుడు ‘సుమన్’ ఈ విషయం మీద ఇటీవల స్పందించారు.

రజినీకాంత్ ఒక్క తమిళనాడు కి మాత్రమే సూపర్ స్టార్ కాదు ,యావత్ ఇండియా కి ఆయనే సూపర్ స్టార్ ,ఇండియన్ సినిమా కి ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకుని వచ్చిన మొదటి హీరో రజినీకాంత్.ఏదైనా సినిమా ప్లాప్ అయినా ,ఆ సినిమా ప్రొడ్యూసర్ లు నష్టాలు చూసిన తన రెమ్యూనిరేషన్ తిరిగి ఇచ్చే వారు రజినీకాంత్.సినిమా నిర్మాత ,థియేటర్ వాళ్ళు రోడ్డు నా పడకుండా చూసుకునే గొప్ప వ్యక్తి,సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి రాక ముందు సినిమా వారే ఆయనతో ఉన్న రిలేషన్ ని ,సీఎం అయ్యాక అయినా చేసిన మంచి పనులు ,అలానే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు గారు డెవలప్ చేసిన వాటి గురించి మాట్లాడితే తప్పు ఏమి ఉంది.మీ డబ్బులు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేని మీరు రజినీకాంత్ లాంటి వ్యక్తి గురించి తప్పు గా మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది అన్నారు.మరి ప్రతి చిన్న దానికి ఓవర్ గా రెస్పాండ్ అయ్యే వైసీపీ వాళ్ళు సుమన్ గారి మాటలకూ ఎలా రిప్లై ఇస్తారో చూడాలి.

462 views