Sudigali sudheer: పెళ్లి కాకముందే ఆడబిడ్డకు తండ్రైన సుడిగాలి సుధీర్..ఆమె ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, May 29, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జబర్దస్త్ షో ద్వారా పరిచయమైనా ఆర్టిస్టులు నేడు సినిమా ఇండస్ట్రీ లో ఏ స్థాయిలో కొనసాగుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు ఇతగాడు మ్యాజిక్ షోస్ చేస్తుండేవాడు. అలా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగే ఇతన్ని జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తున్న వేణు గుర్తించి తన టీం లోకి తీసుకున్నాడు. అలా మొదలైన సుడిగాలి సుధీర్ ప్రస్థానం, ఆ తర్వాత టీం లీడర్ రేంజ్ కి ఎదిగింది. అతనితో పాటుగా ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా బాగా పాపులర్ అయ్యారు. అలా సుడిగాలి సుధీర్ ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా అనతి కాలం లోనే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన బుల్లితెర లో పవర్ స్టార్ అనొచ్చు. ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అలా వచ్చిన క్రేజ్ తో సుధీర్ కి సినిమాల్లో కూడా అవకాశాలు క్యూలు కట్టాయి. కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన సుధీర్, ఆ తర్వాత హీరోగా అనేక సినిమాలు చేసాడు. కొన్ని ఫ్లాప్ గా నిలిచాయి, కానీ గాలోడు చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా సుధీర్ కెరీర్ పీక్ రేంజ్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయనకీ సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే సుధీర్ పెళ్లి కాకముందే ఒక అమ్మాయికి తండ్రి అయ్యాడట. అది కూడా 30 ఏళ్ళు ఉన్న అమ్మాయికి. సుధీర్ ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియతో కలిసి ఈటీవీ లో ‘పోవే పోరా’ అనే షో చేసాడు. ఇది పెద్ద హిట్ అయ్యింది.

ఈ షో నుండే వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. తండ్రి లేని విష్ణు ప్రియా కి తండ్రి స్థానం లో కూర్చొని తండ్రి లేని లోటుని పూడ్చేవాడట సుధీర్. జీవితం లో ఆమెకి ఏ కష్టమొచ్చినా సుధీర్ ముందు ఉండేవాడట. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుధీర్ గురించి విష్ణు ప్రియా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. అంతే కాకుండా సుధీర్ ని తానూ డాడీ అని పిలుస్తూ ఉంటానని, ఇప్పటికీ మా ఇద్దరి మధ్య అలాంటి బాండింగ్ కొనసాగుతుంది అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియా. సుధీర్ కేవలం విష్ణు ప్రియకి మాత్రమే కాదు రష్మీ, వర్షిణి కి కూడా బాగా క్లోజ్. అలా ఆయన స్నేహితుల లిస్ట్ తీస్తే చాలా పెద్దదే ఉంటుంది.

359 views