Ustad bhagath singh: ఆగిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ! మరో స్టార్ హీరో తో హరీష్ శంకర్ కొత్త మూవీ.

Posted by venditeravaartha, July 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి తెలుగు రాష్ట్ర ల లో ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు ఆయన పేరు వినగానే తెలియని వైబ్రేషన్ వస్తుంది.ప్రస్తుతం వరుస గా సినిమా లు చేస్తూ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వారాహి యాత్ర తో ఆంధ్ర రాజకీయాల లో హీట్ ని పెంచారు.వారాహి యాత్ర సూపర్ సక్సెస్ కావడం తో ఎక్కువ సమయం యాత్ర కి కేటాయించాలి అని జనసేన వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

USATD

మూడు సంవత్సరాల ముందు స్టార్ట్ అయినా హరి హర వీర మల్లు ఆ తర్వాత ప్రెసెంట్ #OG
ఉస్తాద్ భగత్ సింగ్ ల సినిమా ల లో హరీష్ శంకర్ గారి సినిమా ని ప్రస్తుతం ఉన్న రాజకీయా యాత్ర ల వలన 2024 ఎన్నికల వరకు వాయిదా వేయనున్నారు.అయితే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సుజిత్ #OG ని మాత్రం ఎన్నికల సమయానికి పూర్తి చేసే పని లో ఉన్నారు అని తెలుస్తుంది.రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే ఇందులో పవన్ కళ్యాణ్ గారి సరసన యంగ్ సెన్సషన్ శ్రీ లీల నటిస్తున్నారు.

PAWAN KALYAN

పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కలయిక లో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికి తెలిసిందే మరి వీరి కలయిక లో రాబోతున్న రెండవ సినిమా కావడం తో అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి అందులో ఇది తమిళ్ బ్లాక్ బస్టర్ తేరి కి రీమేక్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రాజకీయ కమిట్మెంట్ వలన పూర్తి స్థాయి లో ప్రజల మధ్య ఉండటానికి సినిమా ల నుంచి కొంత బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మరల ఈ సినిమా ని పూర్తి చేస్తారు అని తెలుస్తుంది.

USTAD

పవన్ కళ్యాణ్ గారి తో సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు మరొక స్టార్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది,తనకి షాక్ సినిమా తో అవకాశం ఇచ్చిన రవితేజ గారితో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయినా ‘రెయిడ్’ సినిమా ని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.మిరపకాయ సినిమా తో రవితేజ గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ తప్పకుండా ఇస్తారు అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

HARISH SHANKAR

1817 views